కుంకుడు కాయతో ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పూర్వ కాలం నుండి కుంకుడు కాయను వాడుతున్నారు.ప్రస్తుతం మారుతున్న రోజుల్లో కుంకుడు కాయను వాడే వారి సంఖ్య తగ్గిపోతుంది.

సాధారణంగా కుంకుండు కాయను తలను రుద్దుకోవటానికి ఉపయోగిస్తాం.కానీ ఇంటిని శుభ్రం చేయటానికి కుంకుడు కాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

మొదట కుకుండు కాయ రసం ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.ఒక గిన్నెలో 5 కప్పుల నీటిని పోసి 12 కుంకుడు కాయలను వేసి అరగంట సేపు మరిగించాలి.

ఆ నీటిని వడకట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి.ఒక స్ప్రే బాటిల్ లో పావు లీటర్ నీరు,15 ml కుంకుడు కాయ రసం,15 ml వెనిగర్ వేసి బాగా కలిపి కిటికీ అద్దాల మీద స్ప్రే చేసి పొడి క్లాత్ తో తుడిస్తే అద్దాలు తళతళ మెరుస్తాయి.

Advertisement

ఒక బౌల్ లో ఒక కప్పు నీటిని తీసుకోని కుంకుడు కాయ రసాన్ని కలిపి బంగారు ఆభరణాలను అరగంట నానబెట్టి ఆ తర్వాత బ్రష్ సాయంతో శుభ్రం చేస్తే బంగారు ఆభరణాలు మెరుస్తాయి.ఒక కప్పులో కుంకుడు కాయ రసం,నిమ్మరసం కలిపి హ్యాండ్ వాష్ గా ఉపయోగించవచ్చు.

పెంపుడు జంతువులను శుభ్రం చేయటానికి మార్కెట్ లో లభించే షాంపుల కన్నా కుంకుడు కాయ రసం చాలా ఉత్తమమైనది.తివాచీలకు ఏమైనా మరకలు అయితే శుభ్రం చేయటం చాలా కష్టం.

అలాంటి సమయంలో ఆ మరక మీద కాస్త కుంకుడు కాయ రసాన్ని జల్లి శుభ్రం చేస్తే మరక మాయం అవుతుంది.కారును శుభ్రం చేయటానికి హానికరమైన మరియు ఖరీదైన డిటెర్జెంట్లను ఉపయోగించటానికి బదులు కుంకుడు కాయ రసాన్ని ఉపయోగిస్తే కారు మరియు కారు అద్దాలు కూడా తళతళ మెరుస్తాయి.

మంగళ వారం ఈ పనులు చేస్తే ఏమి అవుతుందో తెలుసా?
Advertisement

తాజా వార్తలు