నరకచతుర్దశి రోజు ఏం చేయాలి.? కష్టాలు తొలగాలంటే పాటించాల్సిన నియమాలు, పటించాల్సిన మంత్రాలు ఇవే.!

‘ధన త్రయోదశి’ మరునాడే నరక చతుర్దశి.నరకం నుంచి విముక్తి కోసం చేసే యమ ధర్మరాజు ప్రీత్యర్థం జరుపుకొనే పండుగగా ‘నరక చతుర్దశి’ మొదలైందట.

కానీ, ఆ తరువాతి కాలంలో ప్రాగ్జ్యోతిష పురాన్ని (ఇవాళ్టి అస్సామ్ ప్రాంతం) పాలించిన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన సందర్భాన్ని పురస్కరించుకొని, ‘నరక చతుర్దశి’ జరుపుకోవడం ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పండుగను ‘దసరా’ లానే జరుపుకొంటారు.

How To Celebrate Narak Chaturdashi , Narak Chaturdashi, Dussehra, Lord Krishna,

దసరాకు రావణాసురుడి దిష్టిబొమ్మలు చేసి, దహనం చేస్తారు.నరక చతుర్దశికేమో నరకాసురుడి బొమ్మ దహనం చేస్తారు.

వేకువనే బొమ్మ దహనం చేసి, టపాకాయలు కాల్చి, ఇంటికి వచ్చి తలంటు స్నానం చేస్తారు.ఈ రోజు తెల్లవారకముందే నువ్వులనూనే తలపై వేసుకుని ” ఉత్తరేణి” కొమ్మను నెత్తి మీద ఉంచుకుని తలంటుకోవాలి.

Advertisement

అలా తలంటుకునేటప్పుడు “ శీతలోష్ణ సమాయుక్త సకంటకదళాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః అని చెప్పుకోవాలి.స్నానాంతరం నల్లనువ్వులతో“యమాయ తర్పయామి తర్పయామి తర్పయామి ” అంటూ యమతర్పణం విడవాలి.

నరకాసురుడు మరణించిన సమయం అది.ఆపై యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ!వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ!!ఔదుంబరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే!మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!! అని చెప్పుకోవాలి.ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టుకోవాలి.

ఆ రోజు మినపాకులతోకూర వండుకు తినాలి.వీలుకాకపోతే మినపగారెలైనా సరే.నరకచతుర్దశినే ప్రేతచతుర్దశి అని కూడా అంటారు.సాయంత్రమయ్యాక ప్రదోషకాలంలో పూజ చేస్తారు.

నరకం పాలు కాకుండా ఉండేందుకూ, పాపాలన్నీ పోగొట్టుకొనేందుకూ ఆ సమయంలో నాలుగు వత్తులతో సంప్రదాయబద్ధంగా ఒక దీపం వెలిగిస్తారు.‘దత్తో దీప శ్చతుర్దశ్యామ్ నరక ప్రీతయే మయా, చతుర్వర్తి సమాయుక్తః సర్వపాపాపనుత్తయే’ అంటూ ‘లింగ పురాణం’లోని శ్లోకం చదువుతారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఈ చతుర్దశికి నరకాధిపతి ప్రీతి కోసం, పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ నాలుగువత్తుల దీపం వెలిగిస్తున్నానని అర్థం.అలాగే శివపూజ చేస్తారు.

Advertisement

శాస్రాల్లో ప్రదోషకాలాన చేసే ఈ దీపదానాల వల్ల రెండు విధాలైన ఉపయోగాలు ఉన్నట్లు చెప్పబడింది.ఈ దీపాలు నరకలోకవాసులకు వలసిన వెలుతురును ఇస్తాయి.

ఈ దీపదానాలవల్ల ఇక్కడి వారికి యమమార్గాధికారుల బాధ లేకుండా పోతుంది, నరక బాధ తప్పిపోతుంది.

తాజా వార్తలు