మనం సాధారణంగా ఎన్నో రకాల పెళ్లిళ్లకు హాజరవుతూ ఉంటాం.ఎన్నో రకాల ఖరీదైన పెళ్లిళ్లను చూసి ఉంటాం.
ఎంతో ఖరీదైన శుభలేఖను కూడా చూసి ఉంటాం.ఎందుకంటే ఎవరి స్థోమతకు తగ్గట్టు తమ తమ శుభ లేఖను సాధ్యమైనంత మేర క్రియేటివ్ గా తయారు చేయించుకుంటారు.
అయితే మొదట సాధారణంగా వారికి నచ్చినట్టుగా తయారు చేసుకున్నా ఇక ఆ శుభలేఖ ఎంతో మంది జనాలను ఆశ్చర్యపరుస్తుందనేది మనం ఊహించి ఉండము.కాని అది రోజుల వ్యవధిలో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారిపోతుంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా రాజ్ కోట్ కు చెందిన మౌలేష్‌భాయ్ ఉకానీ అనే వ్యాపారవేత్త కుమారుడి శుభ లేఖ నెట్టింట్లో వైరల్ గా మారింది.అంతగా శుభ లేఖలో ఏముంది మామూలుగా ఉండే కార్డు ఉంటుంది కాని అది చాలా ఖరీదైన కార్డు అయి ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు కదా.కాని మీరు ఊహించింది నిజం కాదు.మామూలుగానే వ్యాపారవేత్తలు అంగరంగ వైభవంగా తమ కూతుళ్ల పెళ్ళిళ్ళు కాని, కొడుకుల పెళ్ళిళ్ళు చేస్తుంటారు.
ఇక ఆ పెళ్లి గురించి అందరూ చర్చించుకునేలా ఏదో ఒక స్పెషాలిటీ పెళ్ళిలో ఉండేలా చూసుకుంటారు.కాని ఈ వ్యాపారవేత్త శుభ లేఖ కొరకు ఏకంగా 7 వేల రూపాయలు ఖర్చు చేశారు.
ఈ శుభలేఖలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే శుభలేఖ కార్డు కాదు.ఒక పెట్టె.దాని బరువు ఏకంగా 4 కిలోల 280 గ్రాములు.ఏంటి శుభలేఖ నాలుగు కిలోలు ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా మీరు చూసింది నిజమే.
తన కుమారుడి వివాహం స్పెషల్ గా ఉండాలని శుభలేఖ దగ్గరి నుండే తన స్పెషాలిటీని చూపించారు.ఇక నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారిన ఈ శుభ లేఖ వార్త నెటిజన్ల కామెంట్స్ తో మరింత వైరల్ గా మారుతోంది.