దేవాలయాలకు స్త్రీలు ఎలా వెళ్ళాలి?

స్త్రీలు ప్రతి శుక్రవారం గుడికి వెళుతూ ఉంటారు.ఆలా గుడికి వెళ్ళితే సుఖ సంతోషాలు,అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.

అయితే శుక్రవారం గుడికి వెళ్లే స్త్రీలు ఎలా వెళ్ళాలి.మన పెద్దలు స్త్రీలు గుడికి ఎలా వెళ్లాలో కూడా చెప్పారు.

చీర,లంగా,ఓణీ వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలి.అలాగే నుదుట కుంకుమ ధరించాలి.

గుడిలో ఇచ్చే పసుపు,కుంకుమను నుదుటి కుంకుమ కింద,విభూతి అయితే నుదుటి బొట్టు పైన పెట్టుకోవాలి.

Advertisement

ఈ విధంగా చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు చెప్పుతున్నారు.వినాయకుని గుడికి వెళ్ళితే గరిక మాలను తీసుకువెళ్లాలి.గరిక మాలను ప్రతి శుక్రవారం వినాయకునికి సమర్పిస్తే కోరిన కోరికలు తిరటమే కాకుండా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది.

అదే శివాలయానికి వెళ్ళినప్పుడు బిల్వ పత్రాలను ఏవైనా బాధలు ఉంటే తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.విష్ణు మూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు తులసి మాలతో వెళ్ళాలి.ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్ళినప్పుడు వెన్న తీసుకోని వెళ్ళాలి.

అదేవిధంగా దుర్గాదేవిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి.ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మన పెద్దలు అంటున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!
Advertisement

తాజా వార్తలు