Sairat : ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసి కొత్త చట్టాన్ని తీసుకోచ్చేలా చేసిన ఆ సినిమా ఏంటి ?

కటౌట్ కాదు కంటెంట్ చూసి మాట్లాడండి అంటారు కొన్నిసార్లు.నిజంగానే కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదు.

 How Sairat Move Effect Maharashtra Government-TeluguStop.com

ఈ సామెతను నిజం చేస్తూ చాలా చిన్న సినిమాలు పెద్ద హీరోలకు దీటుగా థియోటర్ లలో రిలీజ్ అయ్యి సంచలన విజయాలను నమోదు చేసుకుంటున్నాయి.ఈ మధ్య వచ్చిన కాంతారా, బలగం( Kantara ) వంటి సినిమాలను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

అందుకే ఎప్పుడూ కంటెంట్ మాత్రమే పనిచేస్తుంది.మరి ఇప్పుడు అలాంటి ఒక చిత్రం ఎంతో మందిని కదిలించింది.

ఏకంగా ప్రభుత్వాన్ని కూడా చిక్కుల్లో పడేసింది.మరి ఆ సినిమా ఎంటి, దాని గురించి మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Balagam, Kantara, Maharashtra, Nagraj Manjule, Rinku Rajguru, Sairat, Tan

కులాంతర వివాహాల నేపథ్యంలో వచ్చిన ఒక సినిమా ఏకంగా ప్రభుత్వాన్ని మార్చేసే పరిస్థితి వచ్చిందంటే అది మామలు విషయం కాదు.నాలుగు కోట్ల బడ్జెట్ తో వచ్చిన సైరత్ మూవీ( Sairat ) 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడమే కాదు ఏకంగా ప్రభుత్వాన్ని చెవులు మెలేసి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.దాంతో ఇండస్ట్రీ మాత్రమే కాదు మహారాష్ట్ర( maharashtra ) మొత్తం కూడా ఆ సినిమా వైపు దృష్టి పెట్టింది.సైరత్ సినిమాలో ఆకాశ థోసర్, రింకు రాజ్ గురు నటించగా నాగరాజు మంజులే అనే ఒక దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ సినిమా ఇప్పటికీ అనేక భాషల్లో రీమేక్ చేయబడింది.తక్కువ కులానికి చెందిన ఈ హీరో ఒక వైపు చదువు మరోపక్క క్రికెట్లో రాణిస్తాడు.హీరోయిన్ మాత్రం చాలా పెద్దింటి భూస్వామి మరియు రాజకీయవేత్త కూతురు కాగా వీరు కలిసి చదువుకుంటారు.వారి మధ్య మొదలైన స్నేహం కాస్త ప్రేమకు దారి తీస్తుంది దాంతో హీరో ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల చేతిలో దెబ్బలు తింటాడు.

Telugu Balagam, Kantara, Maharashtra, Nagraj Manjule, Rinku Rajguru, Sairat, Tan

ప్రేమ దక్కదని తెలుసుకొని ఈ హీరో హీరోయిన్స్ సిటీ కి వీళ్ళిపోతారు.ఆ తర్వాత ఎలాంటి చిక్కుల్లో పడ్డారు, ఎలా వారిని ఒపించి పెళ్లి చేసుకుంటారు కలిసారా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.అయితే ఈ చిత్రం సాధించిన విజయం ద్వారా ఇలా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రేమ జంటలకు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా ప్రస్తుతం ప్రభుత్వం ఆలోచిస్తుంది.ప్రేమ జంటల కోసం ఒక కొత్త చట్టాన్ని కూడా అమలులోకి తెచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube