నీ సినిమాలు చాలా బాగుంటాయి కానీ డబ్బులు మాత్రం ఎక్కువగా రావు దానికి కారణం ఏమి ఉంటుంది అంటూ ఒక నెటిజన్ నాచురల్ స్టార్ నానిని( Nani ) ప్రశ్నించాడు.దానికి నాని కూడా సరదాగానే స్పందించాడు నాతో నిర్మాతలు మరోలా చెబుతున్నారు అప్పుడప్పుడు వారి కలెక్షన్స్ కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు అంటూ చమత్కరించాడు కానీ ఈ అభిమాని ప్రశ్నించిన దాంట్లో వాస్తవం లేకపోలేదు అనేది పలువురి అభిప్రాయం.
నాని ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో తన నటనను మెరుగు పరుచుకుంటూ ఒక సినిమా తర్వాత మరొక సినిమా చేస్తూ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.

ఇక కొని రోజులు వెనక్కి వెళితే ఒక షో లో నేపోటిజం ( Nepotism )గురించి షో హోస్ట్ నాని ని ప్రశ్నించగా అప్పుడు కూడా నాని భిన్నంగా స్పందించాడు.చూస్తున్న ప్రేక్షకులకే నెపోటిజం ఉంది కానీ మాలో మాకు ఏమీ లేదు అంటూ నాని చెప్పిన కూడా కొంతమంది స్టార్ హీరోలు లేదా టాలీవుడ్ పెద్దలు( Tollywood ) బ్యాగ్రౌండ్ లేని హీరోల పట్ల కాస్త ఎడమొహం గానే ఉంటారు అనేది జగమెరిగిన సత్యం.తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి కూడా వారికి అడ్డంకులు ఉంటాయని పెద్ద బ్యానర్స్ లో పనిచేసే అవకాశం రావాలంటే నాని లాంటి సాధారణ హీరోలకు చాలా కష్టమని పలువులు అభిప్రాయపడుతున్నారు.
పైకి ఎదిగిన నాని లాంటి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ అసలు ఎదగలేక కన్నుమూసిన నటులు కూడా చాలామంది ఉన్నారు.

అగ్ర హీరోలు సాధారణ హీరోలు చిన్న హీరోలు అంటూ విడదీసి పరిశ్రమ చూస్తుంది కాబట్టి వారి సినిమాలకు కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి.ఇంకొక మెట్టు ఎదిగితే తప్ప నాని స్టార్ హీరో అవ్వలేదు అప్పుడే అగ్రస్థాయి దర్శకులతో పనిచేసే అవకాశం లభిస్తుంది.అదే స్థాయిలో వసూళ్లు కూడా వస్తాయి అప్పుడు చెప్పుకునే లెక్కల తీరు కూడా మారుతుంది.
అందుకే చిన్న హీరో ఆయన సాధారణ హీరో అయిన ఇలాంటి బంగపాట్లు తప్పవు.సోషల్ మీడియాలో నానికి ఈ ప్రశ్న ఎదురైన తర్వాత అయినా కొంతమంది మేల్కొంటారని ఆశించాలి.







