రాధేశ్యామ్ కోసం మొత్తం ఎన్ని సెట్లు వేసారో తెలుసా..?

ప్రభాస్, పూజా హెగ్దే జంటగా రాధాకృష్ణ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా రాధే శ్యామ్.

యువి క్రియేషన్స్ వారు దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా మార్చి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

సినిమాలో సగం బడ్జెట్ సినిమా సెట్స్ కే ఖర్చు చేసినట్టు తెలుస్తుంది.ఒక సినిమాకు మాములుగా అయితే ఒకటి రెండు సెట్లు వేస్తారు.

కొద్దిగా పీరియాడికల్ మూవీ అయితే ఓ పది సెట్లు వేస్తారు.కానీ రాధే శ్యామ్ సినిమా కోసం ఏకంగా 101 సెట్లను వేశారట.

ఆర్ట్ డైరక్టర్ ఈ సినిమాకు చాలా కష్టపడి పనిచేశారని తెలుస్తుంది.కరోనా టైం లో యూరప్ సెట్ కూడా హైదరాబాద్ లో వేశారట.

Advertisement

అసలు సినిమాలో నిజం లొకేషన్ కి ఈక్వల్ గా సెట్స్ ఉంటాయని అంటున్నారు.రాధే శ్యామ్ సినిమా ప్రేక్షకులకు ఓ విజువల్ వండర్ గా అనిపిస్తుందని అంటున్నారు.

సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్దే నటిస్తుంది.జస్టిన్ ప్రభాకరణ్ అందించిన మ్యూజిక్ తో పాటుగా థమన్ అందించే బిజిఎం సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు