ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరూ దాదాపు 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్నారు.చిరంజీవి ( Chiranjeevi ) దాదాపు 70 సంవత్సరాల వయసుతో కొనసాగగా మిగిలిన హీరోలందరూ 65 సంవత్సరాలు పైబడిన వారే కావడం విశేషం.
ఇక ఇలాంటి సందర్భంలో తమిళ్ సినిమా ఇండస్ట్రీ కి చెందిన రజినీకాంత్ ( Rajinikanth ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆయనకి 74 సంవత్సరాలు కావడం విశేషం.
అయిన కూడా ఎక్కడ తగ్గకుండా స్టార్ హీరోలందరికీ పోటీ ఇస్తూ ఇప్పుడు ఆయన ముందుకు దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే నిజంగా ఆయనకు సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు.ఆయన బాడీ ఏమాత్రం సహకరించకపోయినా కూడా సినిమా కోసం అంత కష్టపడి రియల్ స్టంట్స్ కూడా చేస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక తన ఊపిరి ఉన్నంత వరకు తన కెరియర్ ను సినిమాకి అంకితం చేయబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.ఇక దాదాపు రజనీకాంత్ ఇంకా 5 నుంచి 6 సినిమాలు చేసే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఆ తర్వాత తను సినిమా నుంచి రిటైర్ మెంట్ ప్రకటించి రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఆయన జైలర్ 2 సినిమా( Jailer 2 movie ) చేస్తున్నాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విశేషాలను త్వరలోనే మేకర్స్ కి తెలియజేయనున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది.ఇక దీంతో పాటుగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్( Director Lokesh Kanakaraj ) లో ఒక సినిమా చేస్తున్నాడు… ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధించి దిశ గా ముందుకు వెళ్తుంది.
చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడు అనేది…
.