ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత తప్పనిసరిగా బ్రష్ చేయాలి.దంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు మంచి టూత్‌పేస్ట్‌ను ఎంచుకుంటారు.
అయితే బ్రష్‌ను చాలా కాలం పాటు ఉపయోగిస్తూ ఉంటారు.అయితే కొంతకాలం తర్వాత బ్రష్ మార్చాలి.
ఒకే బ్రష్‌ను ఎక్కువ రోజులు ఉపయోగించడం వల్ల మీ దంతాలు, చిగుళ్లకు హానికరం.ది సెంటర్స్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం ప్రతీ వ్యక్తి . 3 నుండి 4 నెలలకు ఒకసారి బ్రష్ మార్చుకోవాలి.అయితే ఇంతలోనే మీ బ్రష్ బ్రిజిల్స్ అరిగిపోయి, పూర్తిగా వంగిపోతే వెంటనే బ్రష్‌ను మార్చాలి.
ఒకే బ్రష్‌ను ఎక్కువ కాలం ఉపయోగించడం దంతాలకు మంచిది కాదు.కోల్‌గేట్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం మీకు వైరస్ ఫంగస్‌కు సంబంధించిన ఏవైనా వ్యాధులు వస్తే.
కోలుకున్న వెంటనే మీరు బ్రష్‌ను మార్చాలి.కరోనా వైరస్ సమయంలో పాజిటివ్ వచ్చిన పేషెంట్లు నెగటివ్ వచ్చిన తర్వాత బ్రష్‌లు మార్చుకోవాలని చాలా మంది డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇంతేకాకుండా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే (వారి బ్రష్ పక్కన మీ బ్రష్ ఉన్న పక్షంలో) మీరు బ్రష్‌ను మార్చాలి.అలా చేయకపోతే మీకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.