Devil Movie: కళ్యాణ్ రామ్ “డెవిల్” మూవీ కోసం వాడిన కాస్ట్యూమ్స్ ఎన్ని.. అవి ఎక్కడి నుండి తెప్పించారో తెలుసా..?

నందమూరి కళ్యాణ్ రామ్ ( Kalyan ram ) ఈ మధ్యకాలంలో బింబిసారా, అమీగోస్ వంటి రెండు హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.ఇక త్వరలోనే బింబిసారా 2 సినిమా కూడా చేయబోతున్నారని సమాచారం.

 How Many Costumes Used By Kalyan Ram For Devil Movie-TeluguStop.com

అయితే అమీగోస్ కంటే బింబిసారా ( Bimbisara ) సినిమా ఈయనకు మంచి గుర్తింపు నే కాకుండా నిర్మాతలకు మంచి లాభాల పంటను కూడా ఇచ్చాయి.అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిన బింబిసారా సినిమాకి సీక్వెల్ కూడా ఉండబోతుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలుసు.ఈ సినిమాకి నిర్మాతగా అభిషేక్ నామ డైరెక్టర్ గా శ్రీకాంత్ మేడారం చేస్తున్నారు.

Telugu Amigos, Bimbisara, Costume Rajesh, Devil, Kalyan Ram, Abhishek Nama-Movie

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే కళ్యాణ్ రామ్ తన డెవిల్ సినిమా ( Devil Movie ) కోసం ఎన్ని కాస్ట్యూమ్స్ వాడారు.అవి ఎక్కడినుండి తెప్పించారో అనేది తెలిస్తే మీరందరూ నోరెళ్లబెట్టాల్సిందే.మరి ఇంతకీ కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ లో వాడిన ఆ కాస్ట్యూమ్స్ ఎన్ని? అవి ఎక్కడెక్కడ నుండి తెప్పించారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో బ్రిటిష్ గూడచారిగా కనిపించబోతున్నారు.అలాగే ఇది బ్రిటిష్ ఇండియా కాలానికి సంబంధించిన మూవీ కావడంతో అప్పటి పరిస్థితులకు తగ్గట్టు అప్పటి వేషధారణ ఉండాలని ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ ( Rajesh ) కళ్యాణ్ రామ్ ని సరికొత్త లుక్ లో చూపించారట.

ఇక ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ ఏకంగా 90 కాస్ట్యూమ్స్ ని ఉపయోగించారట.

Telugu Amigos, Bimbisara, Costume Rajesh, Devil, Kalyan Ram, Abhishek Nama-Movie

ఇక ఇందులో హీరో స్పెషల్ గా కనిపించడం కోసం ఆయనని ఎన్నో రకాల డ్రెస్సింగ్ స్టైల్స్ లో చూపించారు.అలాగే కళ్యాణ్ రామ్ కి మెహైర్ ఊల్ తో దాదాపు 60 బ్లేజర్లను ఇటలీ ( Italy ) నుండి స్పెషల్ గా చేయించి తీసుకువచ్చారట.అలాగే దేశీయ కాటన్ కుర్తి తో పాటు ధోతీ ని కూడా ప్రత్యేకంగా తయారు చేయించారట.

అంతేకాకుండా ప్రత్యేకమైన 25 వేయిస్ట్ కోస్ట్ ను కూడా ఉపయోగించారు.అలాగే పురాతన వాచచ్ అయిన హ్యాంగింగ్ వాచ్ ని స్పెషల్ గా ఢిల్లీలో ఒక వ్యక్తి పురాతన వాచ్ లను సేకరిస్తారు అని తెలుసుకొని అక్కడికి వెళ్లి కళ్యాణ్ రామ్ వేసుకునే బ్లేజర్ జేబు సైడ్ కి వేలాడుతూ ఉండే ఆ హ్యాంగింగ్ వాచ్ ని ఆయన దగ్గర నుండి స్పెషల్ గా తీసుకువచ్చారట.

ఇలా డెవిల్ సినిమా కోసం కాస్ట్యూమ్స్ అన్ని చాలా ప్రత్యేకంగా కళ్యాణ్ రామ్ కోసం ఉపయోగించినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube