జనసేన పార్టీలో అధికారిక సభ్యుడు కాకపోయినప్పటికీ గత కొన్ని రోజులుగా జనసేన పార్టీకి తన భేషరతు మద్దతు ఇస్తూ బహిరంగ లేఖలు రాసే హర రామ జోగయ్య తన సామాజిక వర్గం మద్దతు జనసేన కు దక్కేలా తెరవెనక చక్రం తిప్పుతున్నారని విశ్లేషణలు ఉన్నాయి.ముఖ్యంగా పవన్ కూడా జోగయ్యకు అదే స్థాయిలో మర్యాద ఇస్తూ ఉండడంతో పవన్ కు అనదికారిక రాజకీయ సలహాదారుగా జోగయ్య వ్యవహరిస్తూ ఉన్నారు.
ముఖ్యంగా జనసేనపై ప్రతిపక్షాల విమర్శలు చేసినప్పుడు పవన్ తరఫున ఒక బలమైన వాయిస్ లా జోగయ్య ( Harirama Jogaiah )నిలబడ్డారు.అయితే తెలుగుదేశంతో పొత్తు( TDP ) ప్రకటించినప్పటి నుంచి పవన్ ను హెచ్చరిస్తున్న దొరణి లోనే జోగయ్య ఎక్కువగా ప్రతిస్పందిస్తూ ఉండటం విశేషం.
తాజాగా ఇప్పుడు అధికారం పై పవన్ మౌనాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా జోగయ్య మరోసారి లేఖను సంధించడం చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యంగా ప్రజా శ్రేయస్సు కోసం పొత్తు అని పవన్ చెప్పడం వరకు బాగానే ఉన్నప్పటికీ అధికారం పై కూడా పవన్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలన్నట్లుగా జోగయ్య వ్యాఖ్యానించడం విశేషం.జన సైనికులు అధికారాన్ని కోరుకుంటున్నార, ని పవన్( Pawan kalyan ) ప్రజా శ్రేయస్సు ముఖ్యమంటున్నారని అయితే అధికారం లేని ప్రజా శ్రేయస్సు కుదరదని, జనసేనకు జనసైనికులకు మధ్య ఆ అంతరం నడుస్తుందంటూ ఆయన పార్టీలో జరుగుతున్న అంతర్మదనాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేశారు.గత కొన్ని రోజులుగా పవన్ వ్యవహార శైలిపై అసంతృప్తి తో ఉన్న జనసైనికుల మనోఘతాన్ని జోగయ్య స్పష్టం చేశారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు పవన్ కు అవుట్ అండ్ రైట్ గా మద్దతు ప్రకటించిన జోగయ్య గత కొన్ని రోజులుగా పవన్ వైఖరిపై సునిశిత శైలి లో విమర్శలు చేస్తూ ఉండటం పై పార్టీలో కూడా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది .మరి తన సామాజిక వర్గ కురువృద్దుడి మాటలను పవన్ పట్టించుకోని అధికారం పై స్పష్టమైన సంకేతాలను ఇస్తారో లేదో వేచి చూడాలి.