కరోనా వైరస్ మహమ్మారి వలన ప్రతి ఒక్కరు కూడా మాస్క్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు.‘ఫేస్ మాస్క్ లేకపోతే అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి వచ్చింది.ఒక విధంగా చెప్పాలంటే మాస్క్ అనేది మనవ జీవితంలో ఒక భాగం అయిపొయింది అనే చెప్పాలి.కొవిడ్ తీవ్రత తగ్గుతున్నాగాని ఇంకా కొన్ని రోజుల పాటు మాస్క్ పెట్టుకోవాలని ముందు జాగ్రత్తగా వైద్యులు సలహా ఇస్తున్నారు.
ముఖ్యంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో అయితే వైరస్ ఉద్ధృతి అధికంగా ఉంది.చాలా మంది లెక్కలేని తనంతో మాస్క్ ధరించ కుండా ఉండడం వలన ప్రాణాలు కూడా కోల్పోయారు.
అయితే కరోనా వచ్చి రెండేళ్లయినా గాని ఇంకా మాస్క్ ఎలా పెట్టుకోవాలో తెలియని వారు ఉంటారా అంటే నమ్మశక్యం కానీ విషయం అనే చెప్పాలి.ఎందుకంటే చిన్న పిల్లాడిని అడిగిన మాస్క్ ఎలా పెట్టుకోవాలో అనే విషయం టక్కున చెప్పేస్తాడు.
అయితే ఒక రాజకీయ పార్టీ కార్యకర్తకు మాత్రం ఇంకా మాస్క్ ఎలా ధరించాలో తెలియలేదు అంటే అయన ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారో అని అనిపిస్తుంది.అయన మాస్క్ ధరించిన విధానానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అసలు వివరాల్లోకి వెళితే.ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే శివసేన పార్టీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటోంది.అయితే తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేస్తోన్న గోరఖ్‌పూర్ లో శివసేన నేతలు ర్యాలీ నిర్వహించి తదనంతరం ఒక బహిరంగ సభ కూడా ఏర్పాటుచేశారు.
అయితే ఈ సభలో శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే మాట్లాడు తుండగా అతని పక్కనే నిలబడి ఉన్న ఆ పార్టీ కార్యకర్త N-95 మాస్క్ ఎలా పెట్టుకోవాలో తెలియక తికమక పడిపోయాడు.ఆ మాస్క్ ను తీసుకుని ఒకసారి ముఖానికి ముక్కుపైకి పెట్టుకుని, తరువాత మళ్లీ వెనక్కి తీశారు.చివరకు చెవులకు పెట్టుకున్నాడు.అయితే N-95 మాస్క్ అనేది చెవులకు తగిలించుకునే మాస్క్ కాదని గ్రహించి మళ్లీ తీశాడు.చివరకు ముందున్న మరో కార్యకర్త సహాయం తీసుకుని ఆ వ్యక్తి చెప్పినట్లు చేసి ఎట్టకేలకు మాస్క్‌ను సరిగ్గా పెట్టుకున్నాడు.ఎంపీ ప్రసంగం మాట పక్కన పెడితే మాస్క్ పెట్టుకునేందుకు ప్రయత్నించిన పార్టీ కార్యకర్త చేసిన పని మాత్రం ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది.
అందుకే దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది.ఈ వీడియో చుసిన నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.