గూగుల్ క్రోమ్( Google Chrome ) లో సరికొత్త సేఫ్టీ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.దీంతో ఇకపై మరింత యూజర్ ఫ్రెండ్లీ బ్రౌజర్ గా క్రోమ్ యూజర్లకు ఉపయోగపడనుంది.
సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకే ఈ సేఫ్టీ ఫీచర్ ను క్రోమ్ సరికొత్తగా పరిచయం చేసింది.
కంప్యూటర్లలో క్రోమ్ బ్రౌజర్లను ఉపయోగిస్తున్న యూసర్లు వెంటనే అప్డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ CERN IN వెల్లడించింది.గూగుల్ తాజాగా 22 రకాల సెక్యూరిటీ లోపాలను సరిచేసి అప్డేట్ చేసింది.గూగుల్ డెస్క్ టాప్( Google Desktop ) లోని క్రోమ్ బ్రౌజర్ లో ఆటోమేటిక్ గా రన్ అయ్యే కొత్త సేఫ్టీ ఫీచర్ లను అందుబాటులోకి తెచ్చింది.
యూజర్లు అనుకోకుండా ఏవైనా పొరపాట్లు చేస్తే క్రోమ్ బ్రౌజర్ హెచ్చరికలు మూడు చుక్కల మెనులో కనిపిస్తాయి.వెంటనే ఆ మెను ఓపెన్ చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
పాస్వర్డ్ విషయంలో పొరపాట్లు చేస్తే ఈ ఫీచర్ హెచ్చరిస్తుంది.క్రోమ్ వినియోగంలో ఉన్నప్పుడు మీ లొకేషన్ తో పాటు మైక్రోఫోన్ యాక్సెస్ ( Microphone access ) అనుమతులను తొలగించడం కోసం ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.
యూజర్లు ఎంగేజ్ చేయని వెబ్సైట్ల నుండి వస్తున్న నోటిఫికేషన్ లను సేఫ్టీ చెక్ ద్వారా నిలిపివేయవచ్చు.గూగుల్ అందుబాటులోకి తెచ్చిన మెమరీ సేవర్ మోడ్ వల్ల యూజర్లు ఎక్కువగా ఉపయోగించే సైట్లను సులభంగా గుర్తించవచ్చు.ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సైట్లను గుర్తించడం ఇకపై మరింత సులభతరం చేసింది గూగుల్ .గూగుల్ క్రోమ్ లో ట్యాబ్ గ్రూపులను కొన్ని వారాలపాటు ఉండే ఏర్పాటు చేసింది కాబట్టి అవసరం అయిన ట్యాబ్ ను మళ్లీ ఓపెన్ చేసుకునే అవకాశం ఈ ఫీచర్ కల్పించనుంది.గూగుల్ క్రోమ్ యూజర్లు పొరపాటున కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండడం కోసమే గూగుల్ ఈ ఫీచర్ ను పరిచయం చేసింది.