ముత్యాల సుబ్బయ్య( Mutyala Subbaiah ) డైరెక్షన్ లో చిరంజీవి( Chiranjeevi ) హీరోగా వచ్చిన సినిమా హిట్లర్( Movie Hitler ) ఈ సినిమాకి ముందు చిరంజీవి వరుస ప్లాపుల్లో ఉన్నారు.అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలని మలయాళం లో మమ్ముట్టి చేసిన హిట్లర్ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని రూపొందించారు.ఈ సినిమా సిస్టర్స్ సెంటిమెంట్ తో రూపొందింది అయితే ఈ సినిమాకి రైటర్ గా మొదట డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య మరుదూరి రాజా గారిని తీసుకుందాం అనుకున్నారు ఎందుకంటే ఆయన తీసిన సినిమాలన్నిటికీ మరుధూరి రాజా గారే డైలాగ్స్ రాసారు కాబట్టి దీనికి కూడా ఆయాన్నేతీసుకుందాం అనుకున్నారు కానీ ఆయన బిజీ గా ఉండటం తో ఎల్ బి శ్రీరామ్( LB Sriram ) గారిని రైటర్ గా ఈ సినిమాకి తీసుకున్నారు…
ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది…దాంతో రైటర్ గా ఎల్బీశ్రీరామ్ గారికి మంచి పేరు వచ్చింది.అలాగే చిరంజీవి గారికి ఒక 5 సినిమాల తర్వాత ఒక మంచి పెద్ద హిట్ సినిమా వచ్చింది అనే చెప్పాలి.అయితే ఈ విషయం మీద మరుధూరి రాజా మాట్లాడుతూ నేను కొంచం బిజీ గా ఉండి ఆ సినిమా చేయలేదు అందుకే ఎల్బీ శ్రీరామ్ గారు డైలాగ్స్ రాసారు అని చెబుతూనే ఆయన కూడా చాలా బాగా రాసారు అని చెప్పారు…ఇక ఈ సినిమాని మిస్ చేసుకున్నందుకు ఆయన చాలాసార్లు భాదపడినట్లుగా కూడా చెప్తారు…
ఈ సినిమా ముత్యాల సుబ్బయ్య గారికి కూడా మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అనే చెప్పాలి…ఈ ఒక్క సినిమా తో అటు చిరంజీవి కి, ఇటు సుబ్బయ్య కి, ఏల్బి శ్రీరామ్ కి అందరికీ మంచి హిట్ దక్కింది ఇక ఈ సినిమా తర్వాత చిరంజీవి మళ్ళీ వరుసగా హిట్స్ కొట్టారు…ఈ సినిమా తర్వాత సుబ్బయ్య గారితో అన్నయ్య అనే సినిమా కూడా చేశారు అది కూడా మంచి విజయం సాధించింది…