బాలనాధన్ బెంజమిన్ మహేంద్రన్ అలియాస్ బాలు మహేంద్రన్( Balu Mahendra ).ఈయన్ని తెలుగు వారు బాలు మహేంద్ర అని పిలుస్తూ ఉంటారు.
తమిళీయుడు అయినా బాలు మహేంద్ర పుట్టింది మాత్రం శ్రీలంక( Sri Lanka )లో.అక్కడ అమృతకళి అనే చిన్న పల్లెటూర్లో అయన పుట్టారు.కానీ పై చదువులు మాత్రం లోను లో చేసారు.గ్రాడ్యుయేషన్ పట్టభద్రుడిగా అక్కడ చదువు పూర్తి చేసుకోవడం నిజంగా ఒక గొప్ప విషయమే.ఎందుకంటే 60 వ దశకంలో బాలు మహేంద్ర లండన్ లో చదువుకున్న అతి తక్కువ మంది లో ఈయన ఒకరు.డిగ్రీ విదేశాల్లో పూర్తి చేసుకున్న తర్వాత పూణే ఫిలిమ్స్ ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్స్ లో చేరారు.
1969 లో సినిమాటోగ్రఫీ లో గోల్డ్ మెడల్ కూడా అందుకున్నారు.పుట్టింది శ్రీలంక లో అయినా కూడా టీనేజ్ వరకు మాత్రమే అక్కడ ఉన్నారు.తన జీవితం మొత్తం ఎక్కువగా గడిపింది చెన్నైలో కావడం విశేషం.అయితే బాలు మహేంద్ర పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తాడు అని కుటుంబం భావించింది.
వారి కోరిక మేరకు విదేశాల్లో పెద్ద చదువులు పూర్తి చేసాడు కానీ సినిమా ఇండస్ట్రీ పై మక్కువ మాత్రం చిన్న తనం నుంచే ఉందట.అందుకు గల కారణం డేవిడ్ లీన్ అనే ఒక ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు.
ఎలా అంటే డేవిడ్ లీన్( David lean, ) బ్రిడ్జి అఫ్ రివర్ క్వాయి అనే చిత్రాన్ని శ్రీలంక లో షూట్ చేసాడట.ఆ చిత్రం షూటింగ్ ని అక్కడే ఉండి బాలు మహేంద్ర గమించేవాడట.
అయితే డేవిడ్ లీన్ ఒక వర్షం సీన్ తీసే సన్నివేశంలో గట్టిగా ఇప్పుడు వర్షం కురవాలి అని అరిచాడట.దాంతో వెంటనే వర్షం కురవడం మొదలయ్యింది.అసలు ఇలా ఎలా జరిగిందో అక్కడ ఉన్న బాలు మహేంద్ర తో సహా ఎవరికీ అర్ధం కాలేదు.దాంతో తాను సైతం సినిమాకు పని చేయాలి అనే ఆసక్తిని పెంచుకున్నాడు.
ఆ క్షణం నుంచి దర్శకుడు అవ్వాలని ఆశతోనే ఉండేవాడు.చదువు పూర్తవగానే సినిమాలో ఎదో ఒక అయినా కావాలనే ఉద్దేశం తో సినిమాటోగ్రఫి లో చేరాడు.
మొట్టమొదటి సాటి అయన పని చేసిన సినిమా నెల్లు.ఆ తర్వాత అనేక సినిమాలకు పని చేసి మొదట కోకిల అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.
వయసు పై బడ్డాక కూడా 52 షార్ట్ ఫిలిమ్స్ తీయడం విశేషం.