'సరిపోదా శనివారం' సినిమా మీద నాని ఫ్యాన్స్ ఎలా స్పందిస్తున్నారంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నాని ప్రస్తుతం తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.

అందులో భాగం గానే రీసెంట్ గా రిలీజ్ అయిన సరిపోదా శనివారం( Saripoda Sanivaram ) సినిమాతో మాత్రం మరొక సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడంటూ అతని అభిమానులు హంగామా చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా సరిపోదా శనివారం సినిమాకి మొదటిరోజు భారీ కలెక్షన్లు వచ్చాయంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి అందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు.

కానీ తన అభిమానులైతే ఈ సినిమాతో నాని( Nani ) ఇంతకుముందు సినిమాలకు వచ్చిన కలెక్షన్స్ ను ఈ సినిమాతో బ్రేక్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక అలాగే నాని ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నిటికంటే ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉందని అందువల్లే నాని అంటే ప్రతి ఒక్క అభిమానికి చాలా ఇష్టం ఉంటుందని ఆయన సినిమా సినిమాకి ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ అందులో సక్సెస్ అవుతూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే నాని లాంటి హీరో స్టార్ హీరో రేంజ్ కి వెళ్లాలంటే తప్పకుండా ఆయన ఒక భారీ సక్సెస్ కొట్టి ఉండాలి.

మరి ఆ భారీ సక్సెస్ సినిమా సరిపోదా శనివారం అవుతుందా లేదా అనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి.దర్శకుడు వివేక్ ఆత్రేయ( Directed Vivek Atreya ) ఈ సినిమాని మొదటి వన్ అవర్ కరెక్ట్ గా నడిపించినప్పటికీ ఆ తర్వాత కొంచెం తడబడినట్టుగా తెలుస్తుంది.అందువల్లే సినిమాకి రావాల్సిన గుర్తింపు అయితే రాలేకపోతుందనేది వాస్తవం.

Advertisement

ఇప్పటికైనా ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతుందా లేదంటే మీడియం రేంజ్ సక్సెస్ ఫుల్ సినిమాగా మిగిలి పోతుందా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.మొదటి రోజు కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చినట్టుగా సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటికి వస్తుంది.

మరి అందులో ఎంతవరకు నిజం అనేది తెలియాలంటే కూడా మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు