ప్రస్తుతం ఉన్న అన్ని భాషలలో స్టార్ హీరోలను తీసుకుంటే ఏడాదికి ఒక సినిమా తీయడం అనేది కత్తి మీద సామ లాంటిది.సినిమా సినిమాకి మూడు నాలుగు ఏళ్ల సమయం తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు.
అలాగే దర్శకులు కూడా వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు.ఎంత టైం తీసుకున్నా కూడా వారు ఫ్యామిలీ కోసం మాత్రం టైం స్పెండ్ చేయలేకపోతున్నాము అంటున్నారు.
మరి ఒకరిద్దరు కాదు దాదాపు అందరూ టాలీవుడ్ స్టార్స్ , సౌత్ ఇండియాలోని స్టార్స్ రెండు మూడేళ్లకి ఒక సినిమా తీస్తూనే ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోతున్నారు.కానీ ప్రస్తుతం ఒకే ఒక హీరో మాత్రం ప్రతి ఏటా ఒక సినిమాను విడుదల చేస్తూ పర్సనల్ లైఫ్ ని కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ హీరో ఎవరు? అలా పర్సనల్ లైఫ్ కి సినిమా లైఫ్ కి ఇంత బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

హీరో అజిత్( Hero Ajith ) దాదాపుగా ఏటా ఒక సినిమా తీస్తూ వస్తున్నాడు.అయితే ఇప్పుడు కాదు కెరియర్ మొదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా సినిమాలు విడుదల చేశారు.ఒకటి రెండు సంవత్సరాలు మినహా ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 1993 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడూ అజిత్ సినిమాలను( Ajith Movies ) విడుదల చేస్తూనే ఉన్నారు.
ఇన్ని చేస్తూ కూడా ఆయన తన లైఫ్ ని మాత్రం చాలా బ్యాలెన్స్ గా ఇంకా పర్సనల్ లైఫ్ కోసం కూడా స్పెండ్ చేస్తారు.ప్రతి నెల ఏదో ఒక ట్రిప్ లో ఉన్న అజిత్ ఫొటోస్ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.
ఇవన్నీ పక్కన పెడితే తాజాగా అతడికి చిన్న సర్జరీ కూడా జరిగింది.దాన్నుంచి కోలుకున్నాడో లేదో అలా మధ్యప్రదేశ్ లో ఫ్రెండ్స్ తో కలిసి జాలిగా ట్రిప్ కి వెళ్ళాడు.

అక్కడ తన స్నేహితులందరికీ బిర్యానీ కూడా వండి పెట్టాడు.ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆ తర్వాత విడా ముయార్చి( Vidaa Muyarchi ) అనే సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా షూటింగ్ అయిపోగానే మైత్రి మూవీ మేకర్స్ వారు తొలిసారిగా తమిళ్లో గుడ్ బాడ్ అగ్లీ( Good Bad Ugly ) అనే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
దానికి కూడా అజిత్ సైన్ చేశారు.ఇలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేస్తూనే ట్రిప్స్ కు వెళ్లడం అజిత్ స్పెషాలిటీ.అంతే బ్యాలెన్స్ గా కెరీర్ ని కూడా బాగానే నడిపిస్తున్నారు.ఇలా చేయడం ఏ హీరోకి కూడా సాధ్యం అవ్వడం లేదు.
మరి అజిత్ మాత్రం ఇలా ఎలా అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది అంత చిక్కకుండా ఉంది.