Acharya Aatreya : ఆచార్య ఆత్రేయ ప్రేమలో ఎలా ఫెయిల్ అయ్యాడో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రముఖ సినిమా రచయిత ఆచార్య ఆత్రేయ( Acharya Aatreya ) గురించి ప్రత్యేకంగా చెప్పడం కాలేదు ఈ కాలం ప్రేక్షకులకు ఆయన తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు త్రివిక్రమ్ కంటే మంచి డైలాగులు రాసే వాడిగా ఆయనకు పేరు ఉంది.అందుకే స్టార్ డైరెక్టర్ మాధవరావు రచయిత ఆత్రేయతోనే ఎన్నో కథలు, డైలాగులు, పాటలు రాయించుకున్నాడు.

 How Acharya Aatreya Failed In Love-TeluguStop.com

మాధవరావు వరంగల్ జిల్లాకు చెందినవాడు.ఆయన “చిల్లర దేవుళ్ళు”( Chillara Devullu ) అనే నవలను సినిమాగా తీశాడు.

అందులో పాటలు ఆత్రేయతోనే రాయించాడు.


Telugu Acharya Aatreya, Acharyaaatreya, Love Failure, Tollywood-Movie

పెళ్ళీడు పిల్లలు (1982) సినిమాకి ముళ్ళపూడి వెంకటరమణ కథ అందించగా బాపు దానిని డైరెక్ట్ చేశాడు.మధుసూదన్ రావు ప్రొడ్యూస్ చేశాడు.ఈ సినిమాలోని “పదహారు ప్రాయం”( Padaharu Prayam Song ) అనే పాటకు ఆత్రేయ సాహిత్యం అందించాడు.

ఈ సినిమాకి రెండు సంవత్సరాలకు ముందు వంశం వృక్షం సినిమాను బాపు, వెంకటరమణ కలిసి తీశారు.అయితే వారు దీని ప్రివ్యూను ఆత్రేయకు చూపించారు.ఈ సినిమాని బైరప్ప రచించిన వంశవృక్ష నవల ఆధారంగా తెరకెక్కించారు.దీనిని చూశాక ఇందులో శివ భక్తులను వెంకటేశ్వర స్వామి భక్తులుగా ఎందుకు చూపించావు అంటూ ఆత్రేయ నిలదీశాడు.

దాంతో రమణ తెలుగు ప్రేక్షకుల కోసం అలా చేసినట్లు నిస్సహాయతను వ్యక్తం చేశాడు.దీని తర్వాత కూడా మళ్లీ పైన చెప్పినట్లుగా వారు కలిసి పెళ్లిడు పిల్లలు సినిమా( Pellidu Pillalu )కి పనిచేశారు.

మధుసూదన్ రావు ఈ సినిమా నిర్మాత కావడంతో ఆయన ఆత్రేయతోనే పాట రాయించాలనుకున్నాడు.ఆ ఒక పాటను బాపు మార్చమని కోరాడు.

కానీ ఆత్రేయ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు అంటూ సమాధానం ఇచ్చాడు.దాంతో పాటను అలాగే ఉంచి షూటింగ్ పూర్తి చేసి సినిమాని విడుదల చేశారు.

ఆత్రేయ రాసే పాటలు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రతిబింబిస్తుంటాయి.


Telugu Acharya Aatreya, Acharyaaatreya, Love Failure, Tollywood-Movie

నిజానికి ఆత్రేయ ఒక భగ్న ప్రేమికుడు.ఆయన ఒక అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించాడు.కానీ ఆ యువతి గోత్రం, ఆత్రేయ గోత్రం ఒకటే కావడంతో పెళ్లి చేసుకోలేకపోయాడు.

కోడెనాగు మూవీ( Kodenagu Movie )లో “కథ విందువా నా కథ విందువా” అని ఆత్రేయ రాసిన ఓ పాట లిరిక్స్ వింటుంటే ఆయన లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పినట్లే ఉంటుంది.అయితే ఆత్రేయ చివరి రోజుల్లో అన్నమయ్య సినిమా తీద్దామని చాలా ప్రయత్నించాడు కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube