జపాన్ లో 332 వ రోజు కూడా హౌస్ ఫుల్స్ నమోదు చేసుకున్న #RRR

దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) తెరకెక్కించిన #RRR చిత్రం గత ఏడాది విడుదలై ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే.బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ ని సృష్టించి 1300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, అవార్డ్స్ మరియు రివార్డ్స్ విషయం లో కూడా ఊహించని అద్భుతాలు సృష్టించింది.

 జపాన్ లో 332 వ రోజు కూడా హౌస్ ఫుల�-TeluguStop.com

కలలో కూడా ఊహించని ఆస్కార్ అవార్డు #RRR చిత్రం ని వరించింది.అంతే కాకుండా ఆరు నేషనల్ అవార్డ్స్, ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.

ఇండియన్ ఆడియన్స్ కంటే కూడా ఇతర దేశాల్లో కలెక్షన్స్ పరంగా చరిత్ర తిరగరాసింది.ముఖ్యంగా జపాన్ లో ఈ చిత్రం గత ఏడాది విడుదలై ఇంకా ఆడుతూనే ఉంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం విడుదలై 332 రోజులైంది.ఇంకా 16 థియేటర్స్ లో నాన్ స్టాప్ గా ఆడుతూనే ఉంది.

Telugu Japan, Rajamouli, Ram Charan, Tollywood-Movie

ఇలాంటి హిస్టారికల్ రన్ జపాన్( Japan ) సినిమాలకు అలాగే హాలీవుడ్ సినిమాలకు కూడా రాలేదు.అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 332 వ రోజు కూడా హౌస్ ఫుల్స్ పడ్డాయి అట.వచ్చే నెల 21 వ తారీఖున ఈ చిత్రం జపాన్ లో విడుదలై సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంటుందని అంటున్నారు.సంవత్సరం రోజులు మాత్రమే కాదు, అంతకు మించి కూడా ఈ చిత్రం ఆడే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

మరి ఇంతటి ఆదరణ చూపించిన జపాన్ ప్రేక్షకులను మరోసారి కలిసి, ఒక విజయోత్సవ సభ లాగ #RRR మూవీ టీం ఏర్పాటు చేసేందుకు సిద్ధం కాబోతుందని ఇండస్ట్రీ లోని కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.అంటే మరోసారి రామ్ చరణ్ ఎన్టీఆర్( Ram Charan, NTR ) మరియు రాజమౌళి కలవబోతున్నారు అన్నమాట.

Telugu Japan, Rajamouli, Ram Charan, Tollywood-Movie

కేవలం జపాన్ లో మాత్రమే కాదు, ఈ చిత్రాన్ని రీసెంట్ గా అమెరికా లో కూడా కొన్ని లొకేషన్స్ లో రీ రిలీజ్ చేసారు.అక్కడ కూడా ఈ వీకెండ్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ ని రిజిస్టర్ చేసుకుంది ఈ చిత్రం.మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసినప్పుడు ఒక్కరు కూడా పట్టించుకోలేదు.రీ రిలీజ్ లో కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

అలంటికి ఓవర్సీస్ లో ఈ సినిమా ఇన్ని రోజులు అయినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది అంటే అక్కడి ఆడియన్స్ కి ఈ చిత్రం ఏ రేంజ్ లో నచ్చి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube