విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని( MP Keshineni Nani ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.విజయవాడ ఎంపీ టికెట్ ఏ పిట్టలదొరకు ఇచ్చిన తనకు అభ్యంతరం లేదని చెప్పారు.
ప్రజలు తనను కోరుకుంటే ఇండిపెండెంట్ గా అయినా గెలుస్తానేమోనని కేశినేని నాని తెలిపారు.ఏపీలో ప్రస్తుతం రెండు వేదికలు ఉన్నాయన్న ఆయన చంద్రబాబు, జగన్ మధ్యనే విరోధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీలు వేరు, అభివృద్ధి వేరని స్పష్టం చేశారు.తాను ఎప్పుడైనా ప్రజల కోసం, వారి సంక్షేమం కోసమే పని చేస్తానని వెల్లడించారు.