సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటి నుంచి ఇండస్ట్రీకి చెందిన నటీనటులను బాగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్.ఏదో ఒక విషయంలో నటీనటులపై మీమ్స్ క్రియేట్ చేసి బాగా వైరల్ గా మారుస్తూ ఉంటారు.
నిజానికి ఎప్పుడెప్పుడు వారిపై ట్రోల్స్ వేద్దామా అని ఎదురు చూస్తుంటారు.అంతేకాకుండా వారు నటించిన సినిమాలలో ఏదైనా పొరపాటు కనిపిస్తే చాలు వెంటనే దానిని ట్రోల్ చేస్తుంటారు.
దీంతో ఈ ట్రోల్స్ ను చాలా మంది నటీనటులు అస్సలు పట్టించుకోరు.కానీ కొందరు మాత్రం పట్టించుకుంటే ఆ ట్రోలర్స్ ను అస్సలు వదలరు.కొన్ని కొన్ని సార్లు హీరోయిన్ల బాడీ షేమింగ్ పై, హీరోల లుక్ లపై కూడా కామెంట్లు, ట్రోల్స్ చేస్తుంటారు.నిజానికి ఈ ట్రోల్ చేసేవాళ్లు.
ఎవరో ఉండరు.ఎవరైతే ఆ హీరోకి వ్యతిరేకంగా ఉంటారో వాళ్లే ఈ ట్రోల్స్ చేసి బాగా వైరల్ చేస్తుంటారు.
అలా చేయడంతో ఆ హీరోల అభిమానులు కూడా ఆ ట్రోలర్స్ ను బాగా ఆడుకుంటారు.ఇక ప్రస్తుతం మహేష్ బాబు పై కూడా ట్రోల్స్ చేయటంతో ఆయన అభిమానులు బాగా ఫైర్ అవుతున్నారు.
ఇంతకూ అసలు విషయం ఏంటంటే.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఆయన నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది మనసులను దోచుకున్నాడు.హీరోగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటే.వ్యక్తిగతంగా ఎంతో మందికి సహాయం చేసిన మంచి వ్యక్తిగా నిలిచాడు.హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నాడు.
ఇదిలా ఉంటే మహేష్ బాబుకు అందం పరంగా కూడా మంచి అభిమానం ఉంది.ఆయన కోసం అమ్మాయిలు తెగ ఎగబడతారు.ఎందుకంటే ఆయన అందం అలా ఉంటుంది.అయితే తన అందాన్ని చూసి కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.మామూలుగా మహేష్ బాబుకు గడ్డం అంతగా ఉండదు.అయినా కూడా ఆయన చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తాడు.
దీంతో కొందరు ఆయన గడ్డంపై బాగా ట్రోల్ చేస్తున్నారు.ఆయనకు గడ్డం లేకుంటే అచ్చం దంగల్ హీరోయిన్ లా ఉన్నాడు అంటూ ఇద్దరి ఫోటోలను పక్కపక్కన పెట్టి బాగా ట్రోల్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ గడ్డం ట్రోల్ బాగా వైరల్ అవ్వటంతో మహేష్ అభిమానులు దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.ఇక మరికొందరు అచ్చం అలాగే ఉన్నాడు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.
మరి ఈ విషయం మహేష్ బాబు వరకు చేరితే ఆయన ఎలా స్పందిస్తాడో.అసలు ఏమని స్పందిస్తాడో చూడాలి.కానీ మహేష్ బాబు వీటి గురించి అంతగా ఎక్కువగా పట్టించుకోడు అని.ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఎన్ని వాగిన ఆయన మాత్రం చేసేది చేస్తుంటాడు అని అంటున్నారు ఆయన అభిమానులు.