అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి జాన్వీ కపూర్.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తన హాట్ బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తుంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈమె సౌత్ ఎంట్రీ గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదివరకే జాన్వి కపూర్ సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై స్పందించిన ఈమె తాను ఎలాంటి సౌత్ సినిమాలలోను నటించలేదని ఒకవేళ నటిస్తే తానే ఆ విషయాన్ని వెల్లడిస్తానని తెలిపారు.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని, తనతో సినిమా చేయడం తన డ్రీమ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ విధంగా జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో తారక్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈమె మాటలు చూస్తుంటే త్వరలోనే ఈమె సౌత్ ఎంట్రీ ఇవ్వబోతుందని అర్థమవుతుంది.ఇక ఈమె బాటలోనే ఈమె సోదరీ ఖుషి కపూర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసింది.