20 ఏళ్ల కలను నిజం చేసుకున్న హనీరోజ్.. ఆ రంగంలోకి అడుగు పెట్టడంతో?

మలయాళ బ్యూటీ హనీ రోజ్( Honey Rose ) గురించి మనందరికీ తెలిసిందే.

బాలయ్య బాబు హీరోగా నటించిన వీర సింహారెడ్డి( Veerasimha Reddy ) సినిమాలో నటించి ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది.

ఈ ఒక్క మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.మరీ ముఖ్యంగా ఈమె అందానికి యువత ఫిదా అయ్యారు.

కాగా ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరసింహారెడ్డి సినిమా తర్వాత ఈమె ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ వెళ్తూ సందడి చేస్తూ ఉంటుంది.

బాలయ్య సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్‌లో కనిపించకపోయినా రోజూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తూనే ఉంటుంది.

Advertisement

తన గ్లామర్‌ ఫోటోలతో పాటు లెక్కలేనన్ని షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవాల్లో పాల్గొంటూ అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.సినిమాలు చేయకపోయిన స్టార్‌ హీరోయిన్‌ లకు మించిన పాపులారిటీని సొంతం చేసుకుంది.అయితే ఇప్పటి వరకు సినిమాల్లో నటించిన హనీరోజ్‌ త్వరలో నిర్మాతగా( Producer ) మారనుందట.

హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని తాజాగా తన సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది.ఈ క్రమంలో తన సంస్థ లోగోను కూడా పంచుకుంది ఈ బ్యూటీ.

హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్( Honey Rose Varghese Productions ) లోగో పోస్టర్‌ తో పాటు హనీరోజ్‌ ఇలా చెప్పుకొచ్చింది.

సినిమా అనేది చాలా మందికి ఒక కల, ఒక విజన్, ఒక వెంచర్.అదొక ఫాంటసీ.అదొక జీవిత కోరిక.

ఎంతమంది చేరినా తెలంగాణ లో టీడీపీకి కష్టమేనా   ?  
బిస్లరీ సంస్థను అమ్ముకుందామనుకున్న ఫౌండర్.. ఆయన కూతురు రంగంలోకి దిగడంతో..?

దాదాపు 20 ఏళ్లుగా సినిమాల్లో భాగం అయ్యాను.దీనిని నేను ఒక వరంలా భావిస్తున్నాను.

Advertisement

నా యవ్వనం, జీవితం, చదువు, స్నేహం ఇలా అన్నింటిలో సినిమానే పెద్ద పాత్ర పోషించింది.కాబట్టి ఈ పరిశ్రమలో పెద్ద పాత్ర పోషించడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను.

నా పుట్టినరోజు సందర్భంగా గర్వంగా నా కొత్త వెంచర్ లోగోను లాంచ్ చేస్తున్నాను.హనీ రోజ్ వర్గీస్ ప్రొడక్షన్స్ సినీ ప్రేమికుల నుంచి నాకు లభించిన ప్రేమే నాకు గొప్ప పాత్రలు వచ్చేలా చేసింది.

నాపై మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుందని ఆశిస్తున్నాను.నా ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను అని తెలిపింది హనీ రోజ్.

తాజా వార్తలు