ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు ఏర్పాటు చేసిన హోండా... మార్కెట్లోకి 2 కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్స్!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా’( Honda ) మోటార్‌ సైకిల్, ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల కోసం ప్రత్యేకంగా ఓ యూనిట్‌ ను ఏర్పాటు చేస్తున్నట్టు తాజాగా ప్రకటించింది.దాంతో హోండా ప్రేమికులు ఖుషి అవుతున్నారు.

 Honda To Launch 2 New Electric Vehicles Details, Electric Scooter, Electric Vehi-TeluguStop.com

కర్నాటకలోని ( Karnataka ) నర్సాపుర ప్లాంటులో ఈ కేంద్రాన్ని నెలకొల్పుతున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చింది.కాగా ఈ ఫెసిలిటీ నుంచి మొదట 2 ఎలక్ట్రిక్‌ మోడళ్లు 2023-24లో రోడ్డెక్కనున్నాయని తెలుస్తోంది.మధ్యస్థాయి మోడల్‌తోపాటు వాహనం నుంచి వేరు చేయగలిగే బ్యాటరీతో సైతం ఈవీ ( EV ) రానుంది.2030 నాటికి 10 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Telugu Automobile, Ev, Honda Activa, Honda Ev, Honda, Latest, Units, Narsapura-L

అన్నింటికంటే ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విషయం ఏమంటే… మోటార్, బ్యాటరీ, పీసీయూ వంటి కీలక విడిభాగాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తామని హోండా మోటార్‌సైకిల్, స్కూటర్‌ ఇండియా ఎండీ, ప్రెసిడెంట్, సీఈవో అత్సుషి ఒగటా ఈ సందర్భంగా తెలపడం జరిగింది.దేశవ్యాప్తంగా ఉన్న 6,000 కంపెనీ టచ్‌ పాయింట్లలో చార్జింగ్‌ సదుపాయాలను కల్పిస్తామని కూడా చెప్పారు.ఫిల్లింగ్‌ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, ఇతర ప్రాంతాల్లో సైతం బ్యాటరీ స్వాపింగ్‌ కేంద్రాలను నెలకొల్పనున్నారు.

Telugu Automobile, Ev, Honda Activa, Honda Ev, Honda, Latest, Units, Narsapura-L

గుజరాత్‌లోని విఠలాపూర్‌ ప్లాంటులో స్కూటర్ల తయారీకై కొత్త లైన్‌ను జోడించనున్నట్టు కూడా వెల్లడించారు.నర్సాపుర ప్లాంటు( Narsapura ) నుంచి యాక్టివా స్కూటర్ల తయారీని గుజరాత్‌ ప్లాంటుకు బదిలీ చేస్తున్నట్టు కూడా పేర్కొన్నారు.కొత్తగా 160 సీసీ బైక్, 125 సీసీ స్కూటర్‌ను 3 నెలల్లో ఆవిష్కరించనున్నట్టు తెలిపారు.

పండగల సీజన్‌ నాటికి 350 సీసీ బైక్‌ ఒకటి రానుంది.కాగా, భారత్‌లో కంపెనీకి ఉన్న నాలుగు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 52 లక్షల యూనిట్లు.2022-23లో హెచ్‌ఎంఎస్‌ఐ దేశీయంగా 40 లక్షల పైచిలుకు ద్విచక్ర వాహనాలను విక్రయించింది.ప్రస్తుతం కంపెనీ 18 మోడళ్లను 38 దేశాలకు ఎగుమతి చేస్తోన్న సంగతి విదితమే.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 మోడళ్లను 58 దేశాలకు చేర్చాలన్నది సంస్థ ఆలోచన.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube