విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి..

జగనన్న విద్యా దీవెనపూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్.క్రమం తప్పకుండా ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తూ…జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.703 కోట్లను నేడే (24.05.2023) తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు లో బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.</br.

‘జగనన్న విద్యా దీవెన’

పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం.

‘జగనన్న వసతి దీవెన’

ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం.కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ.వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న జగనన్న ప్రభుత్వం.

 Hon'ble Chief Minister To Be Deposited In The Accounts Of Students' Mothers. Y.-TeluguStop.com

ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన( Jagananna Vidya Deevena )జగనన్న విద్యాదీవెన క్రింద జమ చేసిన ఆర్థిక సాయం రూ.10,636.67 కోట్లు గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెడుతూ 2017 సం॥ నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.14,912.43 కోట్లు.జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు

ఉన్నత విద్యకు ప్రోత్సాహం.పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్ మెం( Fee reimbursement )ట్ తో పాటు భోజన వసతి సౌకర్యాలకు వసతి దీవెన, కూడా ఆర్థిక సాయం అందిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన.

జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్ లో మార్పులు చేసి నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు.విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు.

కరిక్యులమ్ లో భాగంగా ఆన్ లైన్ వర్టికల్స్.దీనివల్ల విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలు ఆన్ లైన్ లో నేర్చుకునే వెసులుబాటు.కరిక్యులమ్ లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్ షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న జగనన్న ప్రభుత్వం.40 నైపుణ్యాలలో 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం.ఇప్పటికే 1.20 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, అదే విధంగా Salesforceలో 33,000, AWSలో 23,000, Nasscomలో 20,000, Palo Altoలో 10,000, Alteryx Data Analyticsలో 7,000 మందికి శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్స్ పంపిణీ.దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 2 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే…సత్ఫలితాలిస్తున్న జగనన్న ప్రభుత్వ సంస్కరణలుఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018-19లో 81,813 కాగా జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022- 23 నాటికి కేవలం 22,387 కు చేరింది.2022-23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27% కాగా, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62% మాత్రమే.2018-19 సంవత్సరంలో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (GER).రాబోయే రోజుల్లో GER శాతం 70కి తీసుకు వెళ్ళేలా చర్యలు.2018-19 లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020-21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది.2018-19లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్ మెంట్స్ గణనీయంగా పెరిగి 2021-22 నాటికి 85,000 కు చేరడం విశేషం.ఈ ఏడాదిలో ఇప్పటికే 80వేల మందికి ప్లేస్ మెంట్స్.

ఆగష్టులో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ముగిసేనాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం.

డిజిటల్ విద్య( Digital education) దిశగా అడుగులు.8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్లు.నాడు – నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్ లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు.

ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు, కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన జగనన్న ప్రభుత్వం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube