ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే ఊడిన జుట్టును కూడా మళ్లీ పొందొవ‌చ్చు!

జుట్టు విపరీతంగా ఊడిపోతుందా.? కానీ కొత్త జుట్టు రావడం లేదు.? కురులు రోజురోజుకు పల్చగా మారుతున్నాయా.

? హెయిర్ ఫాల్ సమస్యను అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టోనర్ చాలా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.ఈ టోనర్ ను వాడితే ఊడిన జుట్టును కూడా మళ్లీ తిరిగి పొందొచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టోనర్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఓ లుక్కేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ రెండు నిమిషాల పాటు మరిగిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా పౌడర్( Aloe vera powder ) వేసుకోవాలి.అలాగే మూడు నుంచి నాలుగు రెబ్బలు కరివేపాకు( Curry leaves ) వేసుకుని కనీసం ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకొని బాగా మిక్స్ చేయాలి.తద్వారా మన టోనర్ సిద్ధం అవుతుంది.

Advertisement

ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు తయారు చేసుకున్న టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ విధంగా కనుక చేస్తే జుట్టు కుదుళ్ళు బలోపేతం అవుతాయి.హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

ఫలితంగా జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.

కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ టోనర్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు