30 త‌ర్వాత ముఖంలో మునుపటి గ్లో కనిపించట్లేదా.. అయితే మీరీ హోమ్ మేడ్ సీరం వాడాల్సిందే!

సాధారణంగా వయసు పెరిగే కొద్ది శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.యవ్వనం ఆవిరి అయిపోతూ ఉంటుంది.

పైగా ఇటీవల కాలంలో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, చెడు వ్యసనాలు, పెరిగిన కాలుష్యం, ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది 30 ఏళ్లకే ముసలి వారిగా కనిపిస్తున్నారు.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలు తలెత్తి ముఖంలో మునుపటి గ్లో ఏమాత్రం కనిపించడం లేదు.

మీరు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరంను మీరు వాడాల్సిందే.

ఈ సీరం మిమ్మల్ని మళ్లీ యవ్వనంగా మెరిపిస్తుంది.మునుపటి గ్లో ను తెస్తుంది.మరి ఇంతకీ ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి ఉడికించాలి.

దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించిన తర్వాత జెల్లీ స్ట్రక్చర్ లోకి మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని జెల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక ఆరెంజ్ ను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడగాలి.ఆ తర్వాత తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలు బాగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్మూత్ క్రీమ్ ను సపరేట్ చేసుకోవాలి.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

ఇప్పుడు ఈ ఆరెంజ్ క్రీమ్ ను ముందుగా తయారు చేసి పెట్టుకున్న అవిసె గింజల జెల్ లో వేసి రెండు కలిసేలా బాగా మిక్స్ చేయాలి.

Advertisement

చివరిగా వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose Water ) వేసి మరోసారి కలుపుకోవాలి.తద్వారా మన సీరం సిద్ధం అవుతుంది.ఈ సీరం ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పాటు వాడుకోవ‌చ్చు.

ఉద‌యం స్నానం చేయ‌డానికి గంట ముందు, నైట్ నిద్రించే ముందు ఈ సీరం ను ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రోజుకు రెండుసార్లు ఈ సీరం ను వాడితే చర్మం టైట్ గా మారుతుంది.

ముడతలు, చారలు మాయం అవుతాయి.చర్మం మళ్లీ తెల్లగా మరియు సూపర్ గ్లోయింగ్( White and Glowing Skin ) గా మెరుస్తుంది.

మొండి మచ్చలు తగ్గుముఖం పడతాయి.మునుపటి మెరుపు మళ్లీ మీ సొంతమవుతుంది.

తాజా వార్తలు