ఫేస్ వాష్ అయిపోయింది? అయితే ఇవి ట్రై చేయండి!

ఈ మ‌ధ్య కాలంలో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రూ సోన్స్‌కు బ‌దులుగా ఫేస్ వాష్‌ల‌నే వాడుతున్నారు.చ‌ర్మంపై మ‌లినాల‌ను, ఆయిల్‌ను తొలిగించి.

ముఖాన్ని ఫ్రెష్‌గా, గ్లోగా మార్చ‌డంలో ఫేస్ వాష్‌లు అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.అయితే ఒక్కోసారి ఫేస్ వాష్‌లు అయిపోతుంటాయి.

క‌రెక్ట్‌గా అప్పుడే మ‌న‌కు దాని అవ‌స‌రం ప‌డుతుంటుంది.అలాంట‌ప్పుడు నిరాశ చెంద‌కుండా, కంగారు ప‌డ‌కుండా.

ఇప్పుడు చెప్ప‌బోయే హోం మేడ్ ఫేస్ వాష్‌లు ట్రై చేస్తే బెస్ట్ రిజ‌ల్ట్స్ పొందొచ్చు.మ‌రి లేట్ చేయకుండా ఆ హోం మేడ్ ఫేష్ వాష్‌లు ఏంటో చూసేయండి.

Advertisement
Homemade Face Wash For Glowing Skin! Homemade Face Wash, Glowing Skin, Face Wash

ఫేస్ వాస్ అయిపోయిన‌ప్పుడు.ఒకటిన్న‌ర్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ తేనె అర చేతిలో వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.స‌ర్కిల‌ర్ మోష‌న్‌లో బాగా రుద్దుకుని చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే మురికి, మృత‌క‌ణాలు పోయి.ముఖం కాంతివంతంగా మారుతుంది.

Homemade Face Wash For Glowing Skin Homemade Face Wash, Glowing Skin, Face Wash

అలాగే యాపిల్‌తో కూడా ఫేస్ వాష్ చేసుకోవ‌చ్చు.అదెలా అంటే యాపిల్‌ను మెత్త‌గా పేస్ట్ చేసి అందులో కొద్దిగా నిమ్మ ర‌సం మ‌రియు సాల్డ్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని మొఖంపై బాగా రుద్దాలి.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

రెండు, మూడు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేసిన అనంత‌రం.గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా చేసినా జిడ్డు పోయి.ముఖం ఫ్రెష్‌గా మారుతుంది.

ఇక ఫేస్ వాష్ అయిపోయిన‌ప్పుడు.కొవ్వు తీసిన పాల‌లో పంచ‌దార మ‌రియు తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత‌ ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.వేళ్ల‌తో మెల్ల మెల్లగా రుద్దుకుని కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేస్తే.ముఖం క్లీన్‌గా, గ్లోగా మారుతుంది.

తాజా వార్తలు