సాధారణంగా వయసు పైబడే కొద్ది కళ్ల కింద ముడతలు ఏర్పడుతూ ఉంటాయి.కొందరిలో మాత్రం చిన్న వయసులోనే ఈ సమస్య కనిపిస్తుంటుంది.
ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం, అధిక ఒత్తిడి, పోషకాల లోపం, హార్మోన్ల మార్పులు ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద ముడతలు ఏర్పడతాయి.అయితే వీటిని తగ్గించుకునేందుకు.
ఏవేవో క్రీములు, లోషన్లు, ఆయిల్స్ రాస్తుంటారు.కానీ, న్యాచురల్‌గానే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరి అదెలాగో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్ల కింద ముడతలను మటుమాయం చేయడంలో గ్రేప్స్ అద్భుతంగా సహాయపడతాయి.
ముందుగా కొన్ని గ్రేప్స్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల కింద వేళ్లతో అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగా వాష్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే క్రమంగా కళ్ల కింద ముడతలు తగ్గుతాయి.
అలాగే టమాటా కూడా కళ్ల కింద ముడతలను వదిలించగలదు.
ముందుగా టమాటా పేస్ట్ చేసుకుని.అందులో నిమ్మ రసం వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసి రెండు నిమిషాల పాటు వేళ్లతో మెల్ల మెల్లగా మర్దన చేసుకోవాలి.డ్రై అయిన తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఇక ఒక బౌల్‌లో కొబ్బరి నూనె మరియు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమానికి కళ్ల కింద పూతలా వేసుకుని.పావు గంట లేదా అర గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.
అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా ముడతలు క్రమంగా తగ్గిపోతాయి.