యూరిన్ ఇన్ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

యూరిన్ ఇన్ఫెక్ష‌న్‌ ఇటీవ‌ల కాలంలో చాలా మందిని బాధిస్తున్న స‌మ‌స్య ఇది.అందులోనూ పురుషుల‌తో పోలిస్తే స్త్రీల‌లోనే ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

బ్యాక్టీరియా, క్రిములు మూత్రనాళంలోకి చేర‌వ‌డం, వాట‌ర్‌ను స‌రిగ్గా తీసుకోక‌పోవ‌డం, మూత్రనాళంలో లోపాలు, మూత్రాశయంలో రాళ్లు ఏర్ప‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల యూరిన్ ఇన్ఫెక్ష‌న్‌కు గుర‌వుతుంటారు.దాంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, త‌ర‌చూ మూత్రం రావ‌డం, నీర‌సం, అల‌స‌ట‌, చికాకు, చ‌లి, న‌డుము నొప్పి, పొత్తి కడుపు నొప్పి వంటి స‌మ‌స్య‌లు తీవ్రంగా ఇబ్బంది పెడ‌తాయి.

ఈ క్ర‌మంలోనే యూరిన్ ఇన్ఫెక్ష‌న్‌ను ఎలా నివారించుకోవాలో అర్థం గాక తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే అలాంటి స‌మ‌యంలో కొన్ని టిప్స్ ను పాటిస్తే ఈ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఆపిల్ సైడర్ వెనిగర్ యూరిన్ ఇన్ఫెక్ష‌న్‌కు చెక్ పెట్ట‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
Home Remedies To Get Rid Of Urine Infection! Home Remedies, Urine Infection, Lat

ఉద‌యాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ స్వ‌చ్ఛ‌మైన తేనె క‌లుపుకుని సేవించాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే యూరిన్ ఇన్ఫెక్ష‌న్ క్ర‌మంగా దూరం అవుతుంది.

Home Remedies To Get Rid Of Urine Infection Home Remedies, Urine Infection, Lat

అలాగే మూత్రనాళంలో పేరుకు పోయిన బ్యాక్టీరియా, క్రిముల‌ను తొలిగించి యూరిన్ ఇన్ఫెక్ష‌న్ త‌గ్గించ‌డంలో క‌ల‌బంద ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తుంది.అందు వ‌ల్ల‌, ప్ర‌తి రోజు కొంచెం కొంచెంగా క‌ల‌బంద‌ను తీసుకుంటే చాలా మంది.క‌ల‌బంద‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం హైడ్రేటెడ్‌గా కూడా ఉంటుంది.

యూరిన్ ఇన్ఫెక్ష‌న్‌ను దూరం చేసుకోవాలంటే త‌ప్ప‌కుండా విట‌మిన్ సి ఫుడ్స్ తీసుకోవాలి.క‌మ‌ల‌, బొప్పాయి, బ‌త్తాయి, జామ‌, ఉసిరి, క్యాప్సిక‌మ్ వంటి ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే.

ఇన్ఫెక్ష‌న్ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Home Remedies To Get Rid Of Urine Infection Home Remedies, Urine Infection, Lat
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ప‌సుపు సైతం ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌దు.ప‌సుపు టీ లేదా పాల‌లో ప‌సుపు క‌లిపి తీసుకోవ‌డం చేస్తే.అందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను యూరినరీ బ్లాడర్ బ్యాక్టీరియాను అందం చేసి ఇన్ఫెక్ష‌న్‌ను త‌గ్గిస్తుంది.

Advertisement

ఇక వీటితో పాటు డైట్‌లో పెరుగు, హెర్బల్ టీలు, అల్లం, వెల్లుల్లి, తాజా పండ్లు ఉండేలా చూసుకోండి.పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం త‌గ్గించండి.మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి అల‌వాట్ల‌ను నివారించుకోండి.

మ‌రియు వాట‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకోండి.

తాజా వార్తలు