ముఖ చ‌ర్మం ర‌ఫ్‌గా మారిందా? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి!

సాధార‌ణంగా కొంద‌రి ముఖ చ‌ర్మం ర‌ఫ్‌గా త‌యార‌వుతుంటుంది.కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే స్కిన్ ప్రోడెక్ట్స్ వాడ‌కం, ఎండ‌ల్లో అధికంగా తిరగ‌డం, స్కిన్ కేర్ లేక‌పోవ‌డం, పోష‌కాల లోపం, కాలుష్యం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చ‌ర్మం ర‌ఫ్‌గా మారిపోయి.

ముఖం మొద్దుబారిన‌ట్టు క‌నిపిస్తోంది.దాంతో ఏం చేయ‌లేక‌, ఎలా చ‌ర్మాన్ని మృదువుగా మార్చుకోవాలో అర్థంగాక తెగ స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

అయితే ఎలాంటి చింతా ప‌డ‌కుండా ఇంట్లోనే కొన్ని సింపుల్ టిప్స్‌ను ట్రై చేస్తే ఈజీగా ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డొచ్చు.మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వైట్‌, ఒక స్పూన్ పెరుగు మ‌రియు అర స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని ప‌దిహేను లేదా ఇర‌వై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

Advertisement

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్‌ వాష్ చేసుకుని మాయిశ్చ‌రైజ‌ర్ పూసుకోవాలి.ఇలా రెండు రోజుల‌కు ఒక సారి చేస్తే మీ ర‌ఫ్ స్కిన్ స్మూత్ అండ్ షైనీగా మారుతుంది.

అలాగే అవ‌కాడో పండును మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక గిన్నెలో రెండు స్పూన్ల అవ‌కాడో పండు పేస్ట్ ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ఫేస్‌కు ప‌ట్టించి పావు గంట పాటు ఆర‌నివ్వాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.వారంలో మూడు లేదా నాలుగు సార్లు ఇలా చేస్తే ముఖం మృదువుగా మార‌డ‌మే కాదు కాంతివంతంగా కూడా మెరుస్తుంది.

ఇక ఈ టిప్స్‌తో పాటుగా రోజుకు మూడు లీట‌ర్ల నీటిని సేవించాలి.క‌ఠినంగా ఉండే స‌బ్బుల‌కు బ‌దులు ఫేస్ వాష్‌లు వాడండి.గ్రీన్‌ టీ, తేనె, నట్స్ వంటి ఆహారాలు రోజువారీ డైట్‌లో ఉండేలా చూసుకోండి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఎందుకంటే, వీటిల్లోని విటమిన్‌ ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని స్మూత్‌గా, య‌వ్వ‌నంగా మారుస్తాయి.నిద్రించే ముందు మేక‌ప్‌ను తొలగించి మాయిశ్చ‌రైజ‌ర్ ఖ‌చ్చితంగా అప్లై చేసుకోండి.

Advertisement

తాజా వార్తలు