పేల‌తో ఇబ్బంది ప‌డుతున్నారా.. ఈ ఎఫెక్టివ్ టిప్స్‌తో చెక్ పెట్టేయండి!

పేలు. చాలా మందిని ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో ఇది ఒక‌టి.ముఖ్యంగా అమ్మాయిల్లో పేల స‌మ‌స్య అత్య‌ధికంగా ఉంటుంది.

మ‌న ర‌క్తాన్ని తాగుతూ.వెంట్రుకుల‌ను అంటిపెట్టుకుని ఉండే ఈ పేలు చాలా చిరాకు తెప్పిస్తాయి.

దీంతో వీటిని త‌గ్గించుకునేందుకు మార్కెట్లో దొరికే నూనెలు కొనుగోలు చేసి రాస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే తెగ బాధ ప‌డుతుంది.

అయితే ఇంట్లో కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే.సులువుగా పేల‌ను నివారించుకోవ‌చ్చు.

Advertisement

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.వేపాకు పేలను పోగొట్ట‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

కొన్ని వేప ఆకుల‌ను తీసుకుని మొత్త‌గా పేస్ట్ చేసి.అందులో కొద్దిగా నిమ్మ ర‌సం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు బాగా ప‌ట్టించి.గంట త‌ర్వాత త‌ల‌స్నానం చేసేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పేలు నాశ‌నం అవ్వ‌డంతో పాటు చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.అలాగే బేకింగ్ సోడా కూడా పోల‌ను నివారించ‌గ‌ల‌దు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
చిరంజీవి సినిమాతో కూడా అనిల్ రావిపూడి హిట్టు కొడతాడా..?

ఒక బౌల్‌లో ఒక స్పూన్ బేకింగ్ సోడా మ‌రియు ఒక స్పూన్‌ ఆలివ్ ఆయిల్ వేసి బాగా క‌లిపి.రాత్రి నిద్రించే గంట ముందు త‌ల‌కు అప్లై చేసి.

Advertisement

ఉద‌యం లేవ‌గానే గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే.

పేలు పూర్తిగా త‌గ్గిపోతాయి.ఇక మెంతుల‌తో కూడా పేల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

రెండు స్పూన్ల మెంతుల‌ను రాత్రంతా నీటితో నాన‌బెట్టుకుని ఉద‌యాన్నే పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా హార‌తి క‌ర్ఫూరం క‌లిపి త‌ల‌కు ప‌ట్టించాలి.

అర గంట లేదా గంట పాటు ఆర‌నిచ్చి.ఆ త‌ర్వాత‌ సాధార‌ణ షాంపూతో త‌ల‌స్నానం చేసేయాలి.

ఇలా త‌ర‌చూ చేసినా పేల స‌మ‌స్య దూరం అవుతుంది.

తాజా వార్తలు