విశాఖపట్నం వేదికగా జరిగిన “విశాఖ గర్జన” కార్యక్రమం ఏపీ రాజకీయాలలో సంచలనం రేపుతుంది.వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా గుర్తించాలని ఉత్తరాంధ్ర అధికార పార్టీ నేతలు పలువురు జేఏసీ నాయకులు కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది.అయితే కార్యక్రమం అనంతరం విశాఖ విమానాశ్రయం వద్ద ఏపీ మంత్రులపై రాళ్ల దాడి జరిగింది.
దాడిలో మంత్రి జోగి రమేష్ కారు ధ్వంసం అయింది.దీనంతటికీ ప్రధాన కారణం జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు అని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇదంతా పక్కన పెడితే మంత్రులపై జరిగిన దాడి విషయంలో హోంమంత్రి తానేటి వనిత స్పందించారు.
మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడటం దారుణమని అన్నారు.ప్లాన్ ప్రకారమే మంత్రులపై దాడి జరిగిందని వివరించారు.
విశాఖలో జరిగిన కార్యక్రమం విజయవంతం కావడంతో.గర్జన సక్సెస్ పక్కదారి పట్టించడానికి దాడులకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజల మద్దతు లేకపోవడం వల్ల ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని హోం మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.