బాలకృష్ణ హోస్ట్ గా వస్తున్న అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ కూడా రెడీ అయ్యింది.మొదటి ఎపిసోడ్ చంద్రబాబు గెస్ట్ గా వచ్చి సర్ ప్రైజ్ చేశారు.
అయితే అన్ స్టాపబుల్ 2 లో సెకండ్ ఎపిశోడ్ గెస్టులుగా యువ హీరోలు వస్తున్నట్టు తెలుస్తుంది.బాలయ్య హోస్ట్ గా యువ హీరోలు గెస్టులుగా ఇది అసలు ఎవరు ఊహించి ఉండరు.
ఆ యువ హీరోలు ఎవరు అంటే సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ అని తెలుస్తుంది.ఈ ఇద్దరు యువ హీరోలు ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
బాలయ్య అన్ స్టాపబుల్ 2 షోలో సిద్ధు, విశ్వక్ సేన్ ఇద్దరు ఒకేసారి వచ్చి అలరించారని తెలుస్తుంది.ఈ ఇంట్రెస్టింగ్ కాంబో ఇంటర్వ్యూ ప్రేక్షకులకు నిజంగానే ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పొచ్చు.
అన్ స్టాపబుల్ 2 షోలో బాలయ్య మరింత ఎనర్జీగా కనిపిస్తున్నారు.ఆహా లో వచ్చే ఈ షో దెబ్బకి రికార్డులు బద్ధలు కొట్టేస్తుంది.
ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణ ఇంటర్వ్యూ వల్ల తెలుగు తమ్ముళ్లు సూపర్ హ్యాపీగా ఉన్నారు.అయితే అన్ స్టాపబుల్ 2 లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లు కూడా గెస్టులుగా వస్తారని టాక్.