విజయవాడలో జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తుండగా రాయి దాడి జరగటం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది.ఎడమ కనుబొమ్మపై జరిగిన ఈ దాడికి.
తీవ్ర రక్త స్రవం జరగడంతో…సీఎం జగన్ కి( CM Jagan ) కళ్ళు బైర్లు కమ్మాయి.ఈ ఘటనపై రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి తానేటి వనిత( Home Minister Taneti Vanitha ) స్పందించారు.
శనివారం మండలంలోని తిమ్మాపురంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఆ సమయంలో ఆమె ఘటన జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
విజయవాడలో( Vijayawada ) ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడి పూర్తిగా ప్రతిపక్షాల కుట్రేనని ఆరోపించారు.దాడికి కారణమైన ఏ ఒక్కరిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు.ఎవరెన్ని కుట్రలు చేసినా రానున్న ఎన్నికల్లో ప్రజలే వాళ్లకి తగిన బుద్ధి చెబుతారని.దేవుడా ఆశీస్సులు జగన్ కు.వైసీపీ ప్రభుత్వానికి ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే దాడి జరిగినా అనంతరం విజయవాడ జిజిహెచ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో వైద్యులు సీఎం జగన్ కి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఏపీలో ఎన్నికలకు( AP Elections ) ఇంక నెల రోజులు మాత్రమే సమయం ఉంది.ఎట్టి పరిస్థితులలో అధికారం కోల్పోకూడదు అని వైయస్ జగన్ పక్క వ్యూహాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసే అసెంబ్లీ మరియు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం కూడా జరిగింది.ఈ క్రమంలో ఇక పూర్తిగా ప్రచారానికి పరిమితమయ్యారు.దీనిలో భాగంగా మార్చి నెలాఖరిలో ఇడుపులపాయ నుండి బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.శనివారం బస్సు యాత్ర విజయవాడకు చేరుకుంది.సరిగ్గా సింగ్ నగర్ దగ్గరకు వచ్చేసరికి జగన్ ఎడమ కనుబొమ్మ పై దాడి జరగటం వైసీపీ శ్రేణులకు షాక్ కి గురిచేసినట్లు అయింది.