నిన్న సాయంత్రం ఐదు గంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ప్రచారం ముగిసింది.దీంతో ఒక్కసారిగా మైకులన్నీ మూగబోయాయి.
చెవులు చిల్లు పడేవిధంగా మైకులతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జనాలకు విసుగు పుట్టించే విధంగా మారుమోగిన మైకుల ప్రచారం కు తెరపడింది.
అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు , స్వతంత్ర అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఇలా ప్రతి గ్రామం నుంచి వందల మంది ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రావడం తో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.నిన్న సాయంత్రంతో ఆ తతంగానికి ముగింపు పలికారు.
గత 40 రోజుల నుంచి అన్ని నియోజకవర్గాలు, మండలం, గ్రామాలలో వరుసగా సభలు , సమావేశాలు ,ర్యాలీలు జోరుగా సాగాయి.నేతలంతా ఇంటింటికి తిరుగుతూ తమకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ , ఓటర్లకు అనేక హామీలు ఇస్తూ ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

ఇక ఎన్నికల ప్రచారానికి పులిస్టాప్ పడడంతో పోలింగ్ ప్రక్రియపైనే ఆయా పార్టీలు అభ్యర్థులు దృష్టి సారించారు.ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక హామీలు ఇస్తూ.ఓటర్ల చూపు తమపై ఉండే విధంగా రకరకాల హామీలు , తాయిలాలు, ప్రలోభాల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.అనేక చోట్ల ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వీటికి సంబంధించిన ఫిర్యాదులు అందడం తో పోలీసులు కొన్నిచోట్ల తనిఖీ లు నిర్వహించి కొంతమంది ని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఎన్నికల్లో హారహోరి పోరు నడుస్తుండడం , బీ ఆర్ ఎస్, కాంగ్రెస్ ( BRS, Congress )మధ్యనే ప్రధాన పోటీ అన్నట్లుగా ఉండడంతో రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి పై చేయి సాధించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.కాంగ్రెస్ తామే గెలుస్తామని, బీఆర్ఎస్ మూడోసారి హ్యాట్రిక్ విజయం తమదే అన్న ధీమాలో ఉంది.అలాగే బీజేపీ ( BJP )కూడా దాదాపు అదే ధీమా లో ఉంది.
ఈ సారి హంగ్ తప్పదని, అదే జరిగితే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం అనే ధీమాతో ఉంది.ఏది ఏమైనా తెలంగాణలో జరగబోయే ఎన్నికలలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం కనిపిస్తోంది.







