రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా, రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని, ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని టీడీపీ, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) లు ఎన్ని విమర్శలు చేస్తున్నా, జగన్ మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు.జనం మనసు తాను గెలుచుకున్నానని, వైసిపి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారంతా మళ్లీ తమ పార్టీకి ఓటు వేసి 2024లో అధికారంలో కూర్చోబెడతారనే నమ్మకంతో జగన్( jagan ) ఉన్నారు.
ఆ ధీమాతో నే మన ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందని నమ్మితేనే ఓట్లు వేయాలని ప్రజలకు ధైర్యంగా చెప్పగలుగుతున్నారు.దేశంలో ఎక్కడా అమలు కానీ పథకాలను ఏపీలో జగన్ ప్రవేశపెట్టి పెద్ద సంచలనమే సృష్టించారు.
నేరుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాలకు అందే విధంగా వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పారదర్శకతను జగన్ నిరూపించుకున్నారు.గత ప్రభుత్వాలు కంటే తమ ప్రభుత్వం ఎంత భిన్నంగా పరిపాలన చేయగలిగిందో జగన్ తన పాలన ద్వారా నిరూపించారు.

కుల, మత, వర్గాలను పట్టించుకోకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయడం , ప్రభుత్వ పథకాలు అందే విషయంలో ఎక్కడా ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా నేరుగా జనాలకు అంది విధంగా జగన్ చేపట్టిన చర్యలు, ఇవన్నీ సత్ఫలితాలనే ఇస్తున్నాయి .ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని టిడిపి, జనసేన, బిజెపిలో ఎంతగా ప్రచారం చేసినా, జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనే విషయాన్ని జగన్ గుర్తించారు. అందుకే అంత ధీమాగా ఏ సభ జరిగినా, వై నాట్ 175 అనే నినాదాన్ని జగన్ పదేపదే ప్రస్తావిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ, జనసేనలను జనాలు నమ్మే పరిస్థితిలో లేరని జగన్ అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు, మరికొన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు వైసిపి( YCP ) ప్రభుత్వ పాలనపై ఇంటిలిజెన్స్, సర్వే సంస్థలను రంగంలోకి దించి వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఏ నియోజకవర్గంలో వైసిపి ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటూ, వార్నింగ్ ఇస్తూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.దీనికోసం ఎక్కడికక్కడ కీలక నాయకులకు జగన్ బాధ్యతలు అప్పగించారు.
కచ్చితంగా 2024 ఎన్నికల్లో వైసీపీ జెండాని ఎగురవేస్తామనే ధీమాను వ్యక్తం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో ధైర్యంగా తమ రాజకీయ ప్రత్యర్ధులను డీ కొట్టేందుకు సిద్ధం అవుతున్నారు.







