తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి హెచ్ఎండీఏ లీగల్ నోటీసులు అందజేసింది.ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అంశంలో నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు 48 గంటలలో మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో హెచ్ఎండీఏ పేర్కొంది.అదే విధంగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.