మూడు కొత్త ఫోన్లను లాంఛ్ చేసిన HMD.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

నోకియా మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి.

ఆ ఫోన్ లకు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ధర వివరాలను తెలుసుకుందాం.

HMD నుంచి HMD పల్స్ ప్రో,( HMD Pulse Pro ) పల్స్, పల్స్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లు లాంచ్ అయ్యాయి.ఈ మూడు ఫోన్లు 6.65 అంగుళాల HD+ LCD స్క్రీన్ తో ఉంటాయి.90Hz రిఫ్రెష్ రేట్, 600నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి.ఈ మూడు ఫోన్ల మోడల్ లు ఆండ్రాయిడ్ 14( Android 14 ) ఆధారంగా పనిచేస్తాయి.

ఆక్టా-కోర్ 12nm యూనిసోక్ T606 చిప్ సెట్ తో ఉంటాయి.ఈ మూడు మోడళ్లు 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి గరిష్టంగా 59 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తాయి.

ఇక ప్రో మోడల్ 20W చార్జింగ్ సపోర్టుతో వస్తే, మిగిలిన రెండు మోడళ్లు 10W చార్జింగ్ సపోర్ట్ తో వస్తాయి.ఈ మూడు మోడల్ సైడ్- మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఉంటాయి.

Advertisement

ఈ ఫోన్ల కెమెరా విషయానికి వస్తే.HMD పల్స్ ప్రో 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో ఉంటుంది.HMD పల్స్+( HMD Pulse+ ) 50 మెగాపిక్సల్ కెమెరా, HMD పల్స్( HMD Pulse ) 13- మెగా పిక్సెల్ షూటర్ తో ఉంటుంది.

ఈ రెండు మోడళ్లు వీడియో కాల్స్ సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో ఉంటాయి.

ఈ మూడు మోడళ్లు గరిష్టంగా 6GB RAM తో జత చేయబడ్డాయి.HMD పల్స్ సిరీస్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటాయి.మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ద్వారా 256GB వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.ఇక ఈ ఫోన్లో ఉండే మిగతా ఫీచర్ల విషయానికి వస్తే.4G LTE, వైఫై ఏసీ, బ్లూటూత్ 5.0, NFC, GPS కనెక్టివిటీ, 3.5mm హెడ్ ఫోన్ జాక్, USB టైప్-C పోర్టు లాంటి ఫీచర్లతో ఉంటాయి.HMD పల్స్ ప్రో ధర రూ.16000. బ్లాక్ ఓషన్, గ్లేసియర్ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ రంగులలో ఉంటుంది.HMD పల్స్ ప్లస్ ధర రూ.14240.ఆప్రికాట్ క్రష్, గ్లేసియర్ గ్రీన్, మిడ్ నైట్ బ్లూ రంగులలో ఉంటుంది.HMD పల్స్ ధర రూ.12460.అట్మాస్ బ్లూ, డ్రీమీ పింక్, మీటర్ బ్లాక్ రంగులలో ఉంటుంది.ఈ ఫోన్లను HMD.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు