అంతర్జాతీయ వేదికలపై పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టిస్తోంది.ఈ చిత్రంలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుపొందింది.
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ నిలిచింది.రేసులో అంతర్జాతీయ సినిమాలను సైతం వెనక్కి నెట్టింది ఆర్ఆర్ఆర్ లోని ఈ సాంగ్.
టేలర్ స్విప్ట్ కరోలినా, లేడీ గాగాస్ హోల్డ్ మై హాండ్, రిహాన్నా లిప్ట్ మీ అప్ పాటలను సైతం వెనక్కి నెట్టింది.గోల్డెన్ గ్లోబ్ గెలిచిన సినిమా ఆస్కార్ అవార్డ్ ను సైతం గెలిచే అవకాశం ఉంది.
దీంతో ఆర్ఆర్ఆర్ టీంపై భారత్ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.మొత్తం రెండు విభాగాల్లో అవార్డులకు నామినేషన్ వేయగా.
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ కు అవార్డు లభించలేదు.







