నోటు పై గాంధీ గారి బొమ్మ ఎలా వచ్చిందో తెలుసా? అసలు ఆ ఫోటో ఎప్పుడు, ఎక్కడ, ఎవరు తీశారంటే!

రైలు బండిని నడిపేది “పచ్చ జెండా” అయితే, మన బతుకు బండిని నడిపేది “పచ్చ నోటు”! పైసా లో పరమాత్మఉందనుకుంటాము.“వేదం” సినిమాలో చెప్పినట్టు జేబులు నుండి జేబులలోకి ఎగిరే కాగితమే రూపాయి.

 History Behind Mahatma Gandhi Picture On Indian Currency Notes-TeluguStop.com

మొన్నీ మధ్య మోడీ గారు 500 , 1000 నోట్లు బాన్ చేసి నోటు కష్టాలు చూపించారు.పది రూపాయల నోటు నుండి రెండు వేల రూపాయల నోటు వరకు అన్నిటి మీద “గాంధీ” గారి ఫోటో ఉంటుంది.ఆ ఫోటో ఎప్పుడు తీసింది? అసలు గాంధీ గారి ఫోటో నోటు మీద ఎప్పటినుండి అచ్చు వేశారు? నోటు కథ ఏంటో చూడండి!

నోటు పై “గాంధీ” గారి బొమ్మ డ్రాయింగ్ వేసింది కాదు.ఒక అజ్ఞ్యాత ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటో.“గాంధీ” గారు నవ్వుతూ “లార్డ్ ఫ్రెడ్రిక్ లారెన్స్” గారి పక్కన నించునప్పుడు తీసిన ఫోటో అది.ఫ్రెడ్రిక్ లారెన్స్, బ్రిటిష్ రాజకీయ నాయకుడు.బ్రిటన్ లో మహిళా శ్రేయస్సు కోసం పోరాడారు.భారత- బర్మా కి సెక్రటరీ గా కూడా పనిచేసారు!

1946 లో “గాంధీ” గారు “ఫ్రెడ్రిక్” ని కలిసినప్పుడు ఒక జర్నలిస్ట్ తీసిన ఫోటో అది.వైస్రాయ్ హౌస్ (ఇప్పుడు రాష్ట్రపతి భవన్) దగ్గర తీసిన ఫోటో అది.ఆ ఫొటోలో “గాంధీ” గారిని క్రాప్ చేసి మిర్రర్ ఫోటో చేసి నోటు పై అచ్చు వేశారు!

1987 లో మొదట 500 నోటు పై “గాంధీ” గారి ఫోటో ముద్రించారు.

1996 నుండి అన్ని నోట్ల పై గాంధీ గారి ఫోటో అచ్చు వేయడం ప్రారంభమయ్యింది.అంతకముందు నోటు పై “అశోక స్థంభాలు” ఉండేవి!

1996 లో 500 రూపాయల నోటు రూపు రేకలు మార్చారు

2016 లో 500 , 2000 రూపాయల నోట్లపై మిర్రర్ ఫోటో ఉపయోగించకుండా ఒరిజినల్ ఫోటో ఉపయోగించారు!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube