తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం,( Madhya Pradesh ) భోపాల్ నగరంలోని ఓ హోటల్ రూమ్‌లో ఇద్దరు ముస్లిం యువకులతో కలిసి హిందూ యువతి( Hindu Woman ) అడ్డంగా దొరికింది.ఈ యువతి హోటల్ గదిలో ముస్లిం అబ్బాయిలతో( Muslim Men ) ఉన్నట్లు బజరంగ్ దళ్ కార్యకర్తలు తెలుసుకున్నారు.
వెంటనే మరికొంతమందిని తమ వెంట పెట్టుకుని హోటల్ రూమ్ కి వచ్చారు.ఆ తర్వాత ఆ ముగ్గురు కలిసి ఒకే రూమ్ లో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తర్వాత వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని వీడియో క్యాప్షన్ ప్రకారం తెలుస్తోంది.

వారు అమ్మాయిని, ముస్లిం అబ్బాయిలని పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మేఘ్ అప్‌డేట్స్ ట్విట్టర్ పేజీ ఈ వీడియోని షేర్ చేసింది.ఆ వీడియో ఓపెన్ చేస్తే మనకు బజరంగ్ దళ్ కార్యకర్తలు( Bajrang Dal ) హోటల్ రూమ్ తలుపులు తెరవడం చూడవచ్చు.
అనంతరం ముస్లిం అబ్బాయిలు, యువతి కనిపించింది.ఆ యువతి తన ముఖాన్ని చేతులతో కవర్ చేసుకుంటూ కనిపించింది.ఎందుకంటే వారిని కార్యకర్తలు తమ ఫోన్ కెమెరాల్లో వీడియో రికార్డు చేయడం మొదలుపెట్టారు.

మొదటి వీడియోలో కార్యకర్తలు వారి ముగ్గురిని చాలా కామ్‌గా బయటికి తీసుకెళ్ళినట్లు కనిపించింది.ఆ తర్వాత ఇద్దరిని చితకబాదారని వేరొక వీడియో ప్రకారం తెలుస్తోంది.ఆ సమయంలో ఆ యువతి ముస్లిం అబ్బాయిలను కొట్టొద్దని కార్యకర్తలను తిట్టింది.
లవ్ జిహాదీ( Love Jihad ) కేసులు సమాజంలో ఎక్కువవుతున్నాయని, వీటిలో చివరికి హిందూ అమ్మాయిలు దారుణంగా హత్యలకు గురవుతున్నారని కామెంట్ సెక్షన్‌లో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.వారు ట్రాప్ చేసి చంపేస్తున్నా, ఈ అమ్మాయిలు గొర్రెల్లాగా వారిని నమ్ముతున్నారని ఒక నెటిజన్ అసహనం వ్యక్తం చేశాడు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







