‘హిమాలయన్ వయాగ్రా’ ఈ పేరును చాలా మంది వినే ఉంటారు.లైంగిక సమస్యల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
ఇది ఓ హిమాలయాల్లో దొరికే అరుదైన మూలిక.దీనిని మార్కెట్ లో ‘కీడా జాడి’గా పిలుస్తారు.
లైంగిక సామర్థ్యం పెంచడమే కాకుండా.అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తారు.
ఈ అరుదైన మూలికకు అంతర్జాతీయ మార్కెట్ లో భారీ డిమాండ్ ఉంది.కిలో రూ.25 లక్షలు వరకు ఇది పలుకుతుంది.
అంతటి ఖరీదైన ‘హిమాలయన్ వయాగ్రా’ను ఓ సామాన్యుడు ఇంట్లోనే సృష్టించి అద్భుతం చేశాడు.
ఇంట్లోనే ప్రయోగశాల ఏర్పాటు చేసి కృత్రిమంగా అభివృద్ధి చేసినట్లు హిమాచల్ ప్రదేశ్ కుల్లూకు చెందిన గౌరవ్ శర్మ ప్రకటించాడు.హిమాలయాల్లో లభ్యమయ్యే ఈ ఔషధాన్ని ఇంట్లోనే చిన్నపాటి ప్రయోగశాలను ఏర్పాటు చేసి తొలిదశలో 3 వేల బాక్సుల ‘కీడాజాడీ’ని సాగు చేసినట్లు గౌరవ్ శర్మ పేర్కొన్నారు.
లైంగిక పటుత్వం లేని వ్యక్తులకు చికిత్స కోసం ఈ మూలికను వెయ్యి ఏళ్ల కిందటే వినియోగించారు.







