అమెరికాలో రాజకీయం - శాండర్స్ పై హిల్లరీ సంచలన వ్యాఖ్యలు..

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రిపబ్లికన్ పార్టీ , డెమోక్రటిక్ రెండు పార్టీలమధ్య రాజకీయ వైరాలు ఉండటం సహజమే.

అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తపున పోటీ చేస్తున్న ఉద్దండుల ఎంతో మంది ఉన్నారు, ఎవరికి ప్రజలు చివరి వరకూ అత్యధిక శాతం మద్దతు తెలుపుతారో వారే తుది రేసులో నిలుస్తారు.

ఇదిలాఉంటే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా బెర్నీ శాండర్స్ ను తాను సమర్ధించేది లేదని మాజీ విదేశాంగ శాఖా మంత్రి హిల్లరీ క్లింటన్ చెప్పారు.శాండర్స్ తన స్వశక్తితో ఎదిగి డెమోక్రటిక్ అభ్యర్ధిత్వాన్ని సాధించాల్సి ఉంటుదని అన్నారు.

ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన హిల్లరీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు శాండర్స్ పై ఎవరూ ఇష్టత చూపడంలేదని, ఆయనతో ఎవరూ కలిసి పనిచేయాలని కోరుకోరని అన్నారు.అంతేకాదు

శాండర్స్ ఓ కెరీర్ పొలిటీషియన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు హిల్లరీ.అయితే ఈ వ్యాఖ్యలకి మీరు కట్టుబడి ఉంటారా అని విలేఖరి అడిగిన ప్రశ్నలకి ఆమె తప్పకుండా ఉంటాను అంటూ బదులు ఇచ్చారు.హిల్లరీ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజకీయ విమర్శకుడు నటాలీ షురీ ఆమె అధ్యక్ష పదవికి పోటీ పడటం కోసమే శాండర్స్ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement
నిజ్జర్ హత్య కేసు : ఆ నలుగురు భారతీయులు కస్టడీలోనే, మళ్లీ నోరు పారేసుకున్న కెనడా

తాజా వార్తలు