రైతులు( Farmers ) ఏ పంటను సాగు చేసిన అధిక దిగుబడి సాధించాలంటే మాత్రం ఆ పంట సాగు విధానంపై పూర్తి అవగాహన ఉండాలి. వ్యవసాయంలో( agriculture ) కొన్ని మెళుకువలు తెలుసుకొని పాటిస్తే పెట్టుబడి తో పాటు శ్రమ తగ్గడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
సొరకాయ సాగు చేసే రైతులు ఈ పద్ధతులు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు.ముందుగా ఈ పంటకు అనువైన నేలల విషయానికి వస్తే.
నీరు ఇంకిపోయే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నీరు ఇంకా కుండా ఉండే నేలలు, లవణ శాతం ఎక్కువగా ఉన్న నేలలు ఈ సొరకాయ పంట సాగుకు పనికిరావు.
వేసవికాలంలో నేలను లోతు దుక్కులు దున్నుకోవాలి.ఆ తర్వాత నేల వదులుగా అయ్యేవరకు దమ్ము చేసుకోవాలి.చివరి దమ్ములో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువు వేసి దున్నుకోవాలి.సొరకాయ సాగు( Bottle Gourd Cultivation )ను పైపందిరి, అడ్డుపందిరి, బోదేల ద్వారా నేల మీద పండించవచ్చు.
అయితే పైపందిరి విధానంలో అయితే వివిధ రకాల చీడపీడలు ( Pests )లేదా తెగులు ఆశించడానికి పెద్దగా అవకాశం ఉండదు.మొక్క ఆరోగ్యకరంగా పెరిగి నాణ్యమైన దిగుబడి ఇస్తుంది.
మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగలడం కోసం మొక్కల మధ్య మూడు అడుగుల దూరం మొక్కల వరుసల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
సోరకాయ పంటకు( Bottle Gourd crop ) నీటి తడులు చాలా అవసరం.పంట పూత దశలో ఉన్నప్పుడు ప్రతిరోజు నీటి తడి అందించాల్సి ఉంటుంది.సొరకాయ ఎదిగే కొద్ది పంటకు నీటి అవసరం చాలా ఎక్కువ.
సొర కాయలో 70 నుంచి 100% వరకు నీరే నిండి ఉంటుంది.నీటిని సాధారణ పద్ధతిలో కాకుండా డ్రిప్ విధానం ద్వారా అందించాలి.
పంట విత్తిన 50 రోజుల తర్వాత పంట చేతికి రావడం జరుగుతుంది.పంట వయసు దాదాపుగా 150 రోజుల వరకు ఉంటుంది.
కాయ బరువు ఇంచుమించు ఒక కిలో ఉన్నప్పుడు పంట కోత చేయాలి.