తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.

ఈ క్రమంలో తెలంగాణ( Telangana )లో మరో మూడు రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది.రానున్న రెండు రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఉత్తర తెలంగాణలో 42 నుంచి 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వెల్లడించింది.అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

మరోవైపు ఏపీ కూడా నిప్పుల కొలిమిలా మారింది.రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Advertisement

అయితే ఎండ వేడిమికి పగటిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

వైరల్ వీడియో : ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..
Advertisement

తాజా వార్తలు