ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలా వద్దా అన్న అంశంపై న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను డివిజన్ బెంచ్ కొట్టివేసింది.సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించిన హైకోర్టు డివిజన్ బెంచ్.
సీబీఐతో విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే, సీబీఐతో విచారణ జరిపించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపి ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం జనవరి 18న తీర్పు రిజర్వ్ చేసింది.