చిత్తూరు రేపిస్ట్‌కు ఉరిశిక్ష రద్దు చేసిన హైకోర్టు

గతేడాది నవంబర్ నెలలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో బాలికపై అత్యాచారం జరిగిన విషయం అందరికి తెలిసిందే.

ఈ హత్య కేసులో ఉరిశిక్ష పడిన నిందితుడు మహమ్మద్ రఫీకి హైకోర్టులో ఊరట లభించింది.

అతడి శిక్షను యావజ్జీవగా మారుస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది.బాలిక హత్యాచారం కేసులో రఫీకి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే.

అయితే శిక్ష తగ్గించాలంటూ అతడి తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అతడి మరణశిక్షను తగ్గిస్తూ యావజ్జీవ శిక్షగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షిత తల్లిదండ్రులతో కలిసి నవంబర్ నెలలో చేనేత నగర్‌లోని కల్యాణ మండపంలో పెళ్లికి వెళ్లింది.కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన పడుతూ చుట్టుపక్కల గాలించారు.

Advertisement

ఫంక్షన్ హాల్ వెనుక చిన్నారి విగతజీవిగా కనిపించడంతో అంతా షాకయ్యారు.పోస్టుమార్టం నివేదికలో వర్షితపై అత్యాచారం చేసి చంపేసినట్లు తెలియడంతో అంతా షాకయ్యారు.

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనను పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.నాలుగు రోజుల్లోనే నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌లో అరెస్ట్ చేశారు.

పోలీసులకు దొరక్కుండా గుండు గీసుకుని తిరుగుతున్న అతడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.అయితే ఈ కేసులో అన్ని ఆధారాలను పోలీసులు జిల్లా న్యాయస్థానికి సమర్పించారు.

ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం రఫీని దోషిగా నిర్ధారించింది.అతడికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

కోర్టు తీర్పుపై చిన్నారి కుటుంబంతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.అయితే నిందితుడి తరపున లాయర్లు హైకోర్టును ఆశ్రయించడంతో ఉరిశిక్ష.

Advertisement

యావజ్జీవ కారాగార శిక్షగా మారింది.

తాజా వార్తలు