కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం

కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషాకు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 High Court Order To Provide Security To Independent Candidate Barrelakka Of Kolh-TeluguStop.com

ఈ క్రమంలో ఒక గన్ మెన్ తో బర్రెలక్కకు భద్రత కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలన్న హైకోర్టు బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లకు భద్రత కల్పించాలని సూచించింది.గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలోనే ప్రాణహాని ఉందని చెప్పే అభ్యర్థులకు సెక్యూరిటీ కల్పించాలని తెలిపింది.అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్ దేనన్న హైకోర్టు పోలీసులు కేవలం కార్లు చెక్ చేస్తాం అంటే కుదరదని స్పష్టం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube