పూర్వం సమాజంలోనీ ప్రజలు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యన్ని కాపాడుకుంటూ ఉండేవారు.కానీ ప్రస్తుత సమాజంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యలను( Health problems ) ఎదుర్కొంటున్నారు.
అయితే ఇటలీలోని కొన్ని ప్రాంతాలలోని ప్రజలందరూ ఆశ్చర్యంగా ఎక్కువ కాలం జీవిస్తున్నారు.ఇటలీలోని అబ్రుజోలో( Abruzzo, Italy ) ప్రజలు వంద సంవత్సరాలు పైగా జీవిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలలో తెలిసింది.
ఈ ప్రాంత ప్రజలు ఏలాంటి ఆహార నియమాలను పాటిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటలీలోని ఎల్’అక్విలా ప్రాంతానికి చెందిన ప్రజలు ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారని పరిశోధనలు తెలిసింది.
ఇక్కడి ప్రజల ఆయుష్షు ఎక్కువ ఉండడానికి ప్రధాన కారణం వల్ల ఆహార నియమాలు అని పరిశోధకులు చెబుతున్నారు.వీళ్ళు ముఖ్యంగా రాత్రి భోజనాన్ని ఏడు గంటల లోపే పూర్తి చేస్తారని నిపుణులు చెబుతున్నారు.దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పండి రాత్రి భోజనం ( dinner )నుంచి మరుసటి రోజు భోజనం చేసే సమయం సుమారు 17.5 గంటల వ్యవధి ఉండేలా ఈ ప్రాంత ప్రజలు నియమాన్ని పాటిస్తున్నారు.అలాగే ప్రాసెస్ చేసిన మాంసం, స్వీట్లకు ఈ ప్రాంత ప్రజలు దూరంగా ఉంటున్నారు.
వీళ్ళు తీసుకునే ఆహారంలో తక్కువ క్యాలరీలు ఉండేలా చూసుకుంటున్నారు.
దీని వల్ల దీర్ఘాయువు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలలో తెలిసింది.అలాగే రాత్రి త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం( Metabolism ) పెరుగుతుంది.
రాత్రి భోజనం తర్వాత చేయడం జీవక్రియ రేటు పెరుగుతుంది.అధిక బరువు కూడా అదుపులో ఉంటుంది.
త్వరగా తినడం వల్ల మంచి నిద్ర పడుతుంది.రాత్రి తర్వాత తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రనలో ఉంటుంది.
అలాగే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి.త్వరగా భోజనం చేయడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి.
శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.